Lucknow, Feb 20: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Polling) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అటు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో కీలకమైన మూడో దశ కూడా పూర్తయింది. యూపీ (UP) కంటే పంజాబ్ లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటింగ్ ను పూర్తిచేశారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకేదశలో పోలింగ్ పూర్తవ్వగా... యూపీలో మూడోదశలో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పంజాబ్ (Punjab) లో సాయంత్రం 5 గంటల వరకు 63.44 శాతం, యూపీలో 57.44 శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్ లో గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మూడోదశలో అక్కడడక్కడా ఎన్నికల అధికారులతో ఎస్పీ (SP) ఏజెంట్లు గొడవకు దిగారు. ఈవీఎంల్లో తేడాలున్నాయని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఎస్పీకి ఓటు వేసినప్పటికీ…వీవీప్యాట్‌లో మాత్రం బీజేపీకి వేసినట్లుగా వచ్చిందని ఆరోపించారు. అయితే అలాంటిదేమీ ఉండదని, ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
Polling for #PunjabElections2022 concluded. Visuals from booth number 79-83 in Abohar, Punjab pic.twitter.com/p6n0WXaHbk
— ANI (@ANI) February 20, 2022
ఇక ఈ దశలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) బరిలో కర్హాల్ (Karhal) అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఆయనకు ప్రత్యర్ధిగా బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికలబరిలో దిగిన అఖిలేష్ భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అటు అఖిలేష్ బాబాయి శివపాల్ సింగ్ యాదవ్, ఇతర ఎస్పీ ముఖ్యనేతలు కూడా ఇదే ఫేజ్ లో తమ భవితవ్యాన్ని తేల్చుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా… ఈ సారి పరిస్థితి మారిందని ధీమాగా ఉంది సమాజ్‌వాదీ పార్టీ.
ఇక పంజాబ్ (Punjab) లో మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్ ముగిసింది. ఇక్కడ మొత్తం 13 వందల నాలుగు మంది బరిలో ఉన్నారు. ఇందులో 93 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ లతో పాటూ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కూటమి కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్ (AAP), కాంగ్రెస్ వంటి పార్టీలు సీఎం అభ్యర్ధులను కూడా డిసైడ్ చేసి…బరిలోకి దిగాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కెప్టెన్ అమరీందర్ కొత్త పార్టీ పెట్టి బీజేపీతో కలిసి పోటీ చేశారు. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది.