17 year old Vedant Agarwal killed two people by his overspeeding Porsche car consumed alcohol in Pub Video Viral

మహారాష్ట్రలోని పుణెలో పోర్షే కారు నడిపి ఇద్దరి మరణానికి ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు వేదాంత్ అగర్వాల్ కారణమైన సంగతి విదితమే. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా ఎస్సై రాయాలనే షరతుతో 15 గంటల్లో బెయిల్ వచ్చింది.అయితే తాజాగా అతను ఆల్కాహాల్ పుచ్చుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.

12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు తన స్నేహితులతో కలిసి స్థానిక పబ్‌లో పార్టీ చేసుకున్నాడని పుణె పోలీస్‌ కమిషనర్‌ అమితేశ్‌ కుమార్‌ చెప్పారు. కారు ప్రమాదానికి అతడు మద్యం సేవించి ఉన్నాడని తెలిపారు. మహారాష్ట్రలో 25 ఏండ్లు దాటినవారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉందని, చట్టవ్యతిరేకంగా మైనర్‌కు మద్యం అమ్మిన బార్‌ యజనమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  200 కిలోమీటర్ల వేగంతో పోర్షే కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన మైనర్, అతని తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇద్దరి మరణానికి కారణమైన మైనర్‌ బాలుడికి కోర్టు 14 గంటల్లోనే జువైనల్‌ కోర్టు బెయిలు మంజూరు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 ఏళ్ల మైనర్‌కు జువెనైల్‌ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ, కొన్ని షరతులను విధించింది.

Here's Videos

రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ 300 పదాలతో ఓ వ్యాసాన్ని రాయడం, 15 రోజులపాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయడం, మానసిక పరిస్థితిపై పరీక్ష చేయించుకుని, చికిత్స పొందడం వంటి షరతులను విధించింది. అయితే బాలుడికి బెయిల్‌ ఇవ్వడంపై పుణె పోలీసులు సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌ చేశారు. నేరం తీవ్రత దృష్ట్యా అతడిని మేజర్‌గా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరారు. తాము నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేశామని సీపీ అమితేశ్‌ కుమార్‌ చెప్పారు.