New Delhi, August 31: ప్రధాన న్యాయమూర్తులను కించపరుస్తూ ట్వీట్లు చేసిన కేసులో దోషిగా తేలిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కోర్టు తీర్పు (Prashant Bhushan On Supreme Court Contempt Judgment) అనంతరం స్పందించిన ప్రశాంత్ భూషన్ న్యాయస్థానంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయి జరిమానా (Re 1 fine) చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు తన సీనియర్, న్యాయవాది రాజీవ్ ధవన్ తనకు ఒక రూపాయి ఇచ్చారని ('I Gratefully Accepted' Re 1 Fine) ట్విటర్ వేదికగా ప్రకటించారు.
కోర్టు ధిక్కార కేసులో ప్రశాంత్ భూషణ్‌కు (Prashant Bhushan) అత్యున్నత ధర్మాసనం రూపాయి జరిమానా విధిస్తూ శిక్షను ఖరారు చేసింది. సెప్టెంబరు 15వ తేదీలోగా జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష, లేదంటే మూడేళ్లపాటు ప్రాక్టీస్‌పై నిషేధం తప్పదని హెచ్చరించింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రశాంత్ భూషణ్ ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు
అందులో ప్రశాంత్ భూషణ్‌కు ఆయన లాయర్ రాజీవ్ ధవన్ రూపాయి నాణెం ఇస్తున్నట్టు ఉంది. కోర్టు ధిక్కార కేసులో తీర్పు వెలువడిన వెంటనే తన లాయర్, సీనియర్ సహోద్యోగి రాజీవ్ తనకు రూపాయి ఇచ్చారని, కోర్టు తీర్పును తాను కృతజ్ఞతాపూర్వగా అంగీకరించినట్టు పేర్కొన్నారు.
Prashant Bhushan Tweet
My lawyer & senior colleague Rajiv Dhavan contributed 1 Re immediately after the contempt judgement today which I gratefully accepted pic.twitter.com/vVXmzPe4ss
— Prashant Bhushan (@pbhushan1) August 31, 2020
తాను తప్పేమీ చేయలేదని, కోర్టుకు క్షమాపణ చెబితో తప్పు చేసినట్లు అవుతుందని ప్రశాంత్ భూషన్ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే తీర్పు సందర్భంగా ప్రశాంత్ భూషన్‌పై న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించకపోతే.. మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి జరిమానా చెల్లించేందుకు అతని అంగీకరించినట్లు తెలుస్తోంది