Jairam Ramesh (Photo Credit: IANS)

New Delhi, Sep 5: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జీ 20 సమ్మిట్ సందర్భంగా ఇండియా పేరును భారత్ గా నామకరణం చేస్తూ ప్రకటన చేసింది. భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ఆహ్వాన పత్రికపై ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ('President of Bharat' on G20 Dinner Invites) అని పేర్కొంది. సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్ లో డిన్నర్ ఉంటుందని తెలియజేసింది. జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్‌’ అని పేర్కొన్నారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అందులో రాశారు.

భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండియా పేరును భారత్‌గా పేర్కొన్న కేంద్రం, జీ 20 సమ్మిట్ సందర్భంగా డిన్నర్ కోసం ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటూ ఆహ్వాన పత్రిక

తమకు అందిన ఆహ్వానంలో ఈ మార్పును గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ (Congress Takes Swipe at Modi Government)ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘‘జీ-20 విందు కోసం President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇంతకుముందు ‘ఇండియా: అది భారత్‌’ అని ఉంటుంది. కానీ ఇప్పుడు మోదీ సర్కార్‌ వల్ల దీన్ని.. ‘భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య’ (Union of States Under Assault) అని చదవాలి. ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతోన్న దాడి’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు.

INDIA To Be Renamed as BHARAT

ఇదిలా ఉంటే భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ సమాచారం.