Maritime India Summit 2021: ఫోర్ట్స్ ప్రాజెక్టుల్లో 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి తీసుకువస్తాం, మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
File image of Prime Minister Narendra Modi (Photo Credits: PIB)

New Delhi, Mar 2: మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను (Maritime India Vision-2030 E-Book) ప్రధాని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy), గుజరాత్ సీఎం విజయ్ రూపాని, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్‌ తదితర దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మారిటైమ్ రంగంలో భారత్ విజయాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ విజయయాత్రలో భాగస్వాములు అవ్వాలని ప్రపంచదేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సముద్ర రంగంలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు. దేశంలో నౌకాశ్రయాల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని, 2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని ప్రధాని ఉద్ఘాటించారు. జల రవాణా మార్గాలు చౌక మాత్రమే కాదని, పర్యావరణ హితం కూడా అని అభిప్రాయపడ్డారు.

సముద్ర మార్గంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నామని పీఎం మోదీ వివరించారు.పోర్టులపై 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. సముద్రరంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అటు సముద్ర పర్యాటకానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని, 78 లైట్ హౌస్ ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

మారిటైమ్‌ ఇండియా సదస్సులో ఏపీ సీఎం వైయస్ జగన్, నేటి నుంచి 4వ తేదీ వరకు మారిటైమ్ ఇండియా సదస్సు, మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఫోర్ట్స్ ప్రాజెక్టుల్లో 2035 నాటికి 82 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని ప్రధాని మోదీ తెలిపారు. మారిటైమ్ సెక్టార్ లో పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులను పెంచుతామని చెప్పారు. దేశంలోని పోర్టుల మధ్య జల రవానాను పెంచుతామని అన్నారు. మారిటైమ్ సమ్మిట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షిప్ యార్డులు, వాటర్ వేస్, పోర్టుల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. 2015 నుంచి 2035 మధ్యలో 574 ప్రాజెక్టులకు పైగా చేపడతామని... వీటి విలువ రూ. 6 లక్షల కోట్లకు పైగా (82 బిలియన్ డాలర్లు) ఉంటుందని అన్నారు. 2030 నాటికి 23 వాటర్ వేస్ ని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని చెప్పారు.

గతంలో ఎన్నడూ లేనంతగా జల మార్గాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మోదీ అన్నారు. జల రవాణా వల్ల ఖర్చు ఎంతో తగ్గుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల టూరిజం కూడా పెరుగుతుందని అన్నారు. అన్ని మేజర్ పోర్టుల్లో సోలార్, విండ్ పవర్ సిస్టమ్ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జలరవాణాలో ఇండియా పెద్ద శక్తిగా ఎదుగుతోందని అన్నారు. మరోవైపు... భారత సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న 189 లైట్ హౌసుల్లో 78 లైట్ హౌసులను టూరిజం కేంద్రాలుగా కేంద్రం అభివృద్ధి చేయాలనుకుంటోంది.

త్వరలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది, పుదుచ్చేరిలో సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా, తమిళంలో మాట్లాడలేనందుకు క్షమించమంటూ తమిళ రాగం

నేటి నుంచి 4వ తేదీ వరకు మారిటైమ్ ఇండియా సదస్సు (Maritime India Summit 2021) జరగనుంది. కాగా, సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే పనిలో ఉందని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందాలపై మారిటైమ్‌ ఇండియా రెండో విడత సదస్సులో సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తీర రాష్ట్రాలు, భాగస్వాములు ఈ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.