Prostitution Racket Busted in Noida: నగరంలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టును రట్టు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఎహెచ్‌టియు)తో కలిసి స్థానిక పోలీసులు సోమవారం దాడులు నిర్వహించినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) మనీష్ మిశ్రా తెలిపారు.
స్పా సెంటర్ నుంచి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా, రాకెట్‌లో పాల్గొన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ADCP మిశ్రా తెలిపారు. సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోని బరౌలా గ్రామంలో ఉన్న స్పా సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 70 ఏళ్ల ముసలి తాతల రూంకి కాలేజి అమ్మాయిలు, వారి రేటు రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు, చెన్నైలో సెక్స్ రాకెట్ చేధించిన పోలీసులు, నిందితులు అరెస్ట్
స్పా సెంటర్‌లో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (మహిళా భద్రత) సౌమ్య సింగ్, ఏసీపీ (నోయిడా -3) శవ్వ్యా గోయల్ మరియు AHTU ఇంఛార్జి ఇన్‌స్పెక్టర్ రాజీవ్ బల్యాన్ నేతృత్వంలో దాడులు జరిగినట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.ఘటనా స్థలం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.9,780 నగదు, 26 విజిటింగ్ కార్డులు, కొన్ని అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.