Puri, June 19: జూన్ 23న ప్రారంభం కానున్న చారిత్రక పూరి జగన్నాథ్ రథయాత్ర (Jagannath Rath Yatra in Puri 2020), దాని అనుబంధ కార్యకలాపాలను కోవిడ్ కారణంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని పేర్కొంది. ప్రజారోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు (Puri Rath Yatra) అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం (Supreme Court stays) చేసింది. ఫ్యామిలీ సభ్యుల మధ్య వేగంగా కరోనా వ్యాప్తి, రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో 13,586 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 3 లక్షల 80 వేలకు చేరిన కరోనా కేసుల సంఖ్య
రథయాత్ర నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని, ఇది కరోనా వైరస్ (Coronavirus) మరింత వేగంగా వ్యాపించడానికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించవద్దని సూచించింది.
ఒక వేళ రథయాత్ర (Puri, Rath Yatra 2020) జరిపితే జగన్నాథుడు మనల్ని క్షమించడని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఏడాది ఒడిశాలోని పూరిలో రథయాత్రకు (Jagannath Puri Rath Yatra 2020) అనుమతించడం లేదని చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. కరోనా వ్యాప్తి కారణంగా పూరీసహా రాష్ట్రంలో మరెక్కడా రథయాత్రలు నిర్వహించకుండా కట్టడిచేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి రథయాత్రకు అనుమతిస్తే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడతారనీ, ఈ కరోనా సమయంలో ఇది అత్యంత ప్రమాదకరమని వాదించారు. ఇది చాలా సీరియస్ అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందించేందుకు రేపటి వరకు సమయం కావాలని కోర్టును కోరారు. అయితే ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం జూన్ 30 వరకు ఎక్కువమంది ప్రజలు ఒక చోట హాజరు కాకూడదని ప్రకటించింది. ఎట్టకేలకు జూన్ 23న ప్రారంభం కానున్న రథయాత్రను కోర్టు నిలిపివేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన
పూరి జగన్నాథ్ రథయాత్ర విశేషాలు
ఒడిషాలోని పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడిగా పూజలందుకుంటున్నాడు. భగవంతుడు భక్తుల మధ్యకు వచ్చి అత్యంత వైభవంగా జరుపుకొనే మహోత్సవం జగన్నాథుని రథయాత్ర (Rath Yatra 2020). ఏడాదంతా గర్భాలయంలో ఉండే జగన్నాథుడు ఆషాడ శుద్ధ విదియ నాడు మాత్రం తన సోదరి, సోదరులు సుభద్ర, బలభద్రులతో కలసి రథాలను అధిరోహించి పుర వీధుల్లో విహరిస్తారు. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత లాంటి ప్రాచీన గ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన ఉంది.
ప్రపంచంలోని ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. దీని కోసం ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయాలన్నింటికీ పూరీ జగన్నాథాలయం మినహాయింపు. బలభద్ర, సుభద్రల సమేత జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. కాబట్టే జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భక్తులు భావిస్తారు.