Newdelhi, Dec 22: పరస్పర సమ్మతితో జరిగిన శృంగారాన్ని రేప్ (Rape) కేసు కింద పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సంచలన తీర్పు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు అన్నట్టు మహిళలు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది. తనపై నమోదైన రేప్ కేసును కొట్టివేయాలంటూ ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం యువతి ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొంది. యువకుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టెయ్యాలని పోలీసులను ఆదేశించింది.
Quashing #FIR of sexual assault, Delhi high court says some use provision to 'harass' menhttps://t.co/0jGUjwfyxt
— The Telegraph (@ttindia) December 21, 2024
న్యాయమూర్తి ఏమన్నారంటే?
కేసు విచారణ, తీర్పు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అత్యాచారం మహిళలపై జరిగే చాలా హేయమైన చర్య. కానీ కొందరు మహిళలు తమతో సంబంధం కలిగిన పురుషుడిని వేధించేందుకు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇక ఈ కేసులో యువకుడు సమర్పించిన వాట్సప్ చాటింగ్ లు, రికార్డింగ్స్ బట్టి చూస్తే ఇద్దరూ పరస్పరం అంగీకారంతోనే శారీరక బంధంలోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతున్నది. స్త్రీలు చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల పురుషులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పేందుకు ఈ కేసు స్పష్టమైన ఉదాహరణ. ఇది రేప్ కేసు కాదు’ అని పేర్కొన్నారు.