Jaipur, Mar 8: రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో ఓరల్ సెక్స్ చేయడానికి నిరాకరించినందుకు అతని ఇద్దరు స్నేహితులు కలిసి.. హత్య చేసిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నివేదికల ప్రకారం, ఎండిపోయిన చెరువులో శవం (Murder, 40-Year-Old Man) కనుగొనబడింది. తొమ్మిది రోజుల క్రితం హత్య జరిగినట్లు సమాచారం.బరన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కుమార్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 26న బరన్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓం ప్రకాష్ బైర్వా శవమై కనిపించాడు.
సాంకేతిక దర్యాప్తు, విచారణ ఆధారంగా ఇద్దరు నిందితులు మురళీధర్ ప్రజాపతి (32), సురేంద్ర యాదవ్‌లను పోలీసులు గుర్తించారు. ప్రజాపతి ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే యాదవ్ అరెస్టుకు భయపడి విషపూరితమైన పదార్థాన్ని తీసుకోవడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.నిందితులిద్దరూ బరన్ నగరానికి చెందిన వారని అధికారి తెలిపారు. ప్రజాపతి రోడ్డు పక్కన దాబా నడుపుతుండగా, యాదవ్ రోజువారీ కూలీ. కొంపముంచిన స్వలింగ సంపర్కం, రూంకి రాకుంటే గే సెక్స్ వీడియోలు బయటపెడతానని యువకుడు బ్లాక్ మెయిల్, తట్టుకోలేక గొడ్డలితో నరికి చంపేసిన మరో యువకుడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 26న ఓం ప్రకాష్ బైర్వా(40), అతని స్నేహితులు మురళీధర్ ప్రజాపతి, సురేంద్ర యాదవ్‌తో కలిసి మద్యం సేవించారు. అనంతరం ముగ్గురు ప్రజాపతి సోదరుడిని చూడటానికి సమీపంలోని గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రజాపతి, మురళీధర్ తమతో ఓరల్ సెక్స్ (Refusing 'Sexual Favours') చేయాలని బైర్వాను బలవంతం చేశారు. అందుకు అతను ససేమిరా అనడంతో బలమైన ఆయుధంతో కొట్టి చంపారు. ఢిల్లీలో మగాళ్లను కూడా వదలని కామాంధులు, ఇద్దరు మైనర్లపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతరం మృతదేహాన్ని ఓ చెరువులో పడేసి (Body Dumped In Dry Pond)అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు సురేంద్ర యాదవ్, మురళీధర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని విచారిస్తుండగా.. మరొరకు అరెస్ట్ భయంలో విషం తాగడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బరన్ ఎస్పీ రాజ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. కాగా ప్రజాపతి రోడ్డు పక్కన దాబా నడుపుతుండగా, సరేంద్ర యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు అని బరన్ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాంవిలాస్ తెలిపారు.