Jaipur, Sep 5: రాజస్దాన్‌లోని జైసల్మీర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు నెల రోజులుగా ప్రేమించాలని బాలిక వెంటపడుతున్నాడు.ఆగస్ట్ 31న బాలిక స్కూల్‌కు వెళుతుండగా అడ్డగించిన నిందితుడు ఆరోజు రాత్రి తనతో ఫోన్‌లో మాట్లాడకుంటే బాలిక అభ్యంతరకర వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు.
బాలిక భయంతో అతడితో ఫోన్‌లో మాట్లాడగా బయటకు రావాలని పిలిచిన నిందితుడు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించాడు. ఆపై రమ్‌దెవ్ర గ్రామంలోని పంట పొలంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి (Stalker rapes Class 11 girl) పాల్పడ్డాడు.అనంతరం బాలిక స్ప్రహ కోల్పోగా బాధితురాలిని అక్కడే విడిచి పరారయ్యాడు. బాలిక అరుపులు విన్న స్ధానికులు అతడిని వెంబడించగా పరారయ్యాడు.
నిందితుడి కారు పొలంలోనే ఉండటం స్దానికులు గుర్తించారు. పదిరోజుల కిందట నిందితుడు తనపై లైంగిక దాడికి పాల్పడి నేరాన్ని వీడియోలో (obscene video) రికార్డు చేశాడని, ఆ వీడియో బహిర్గతం చేస్తానని (threatens to leak obscene video) తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.