Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi, May 13: రాజ్య‌స‌భ‌లో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 57 స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆయా రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌ల‌కు (Rajya Sabha Elections 2022) కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా 15 రాష్ట్రాల‌కు చెందిన ఈ సీట్ల‌కు జూన్ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నెల 24న విడుద‌ల చేయ‌నుంది. ఏపీలో 4 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జరుగుతాయి.

ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యులు ప్రభు సురేష్‌ ప్రభాకర్‌, టీజీ వెంకటేశ్‌, సుజనా చౌదరి, విజయసాయిరెడ్డిల పదవీ కాలం కూడా జూన్‌ 21తో ముగుస్తున్నది. కాగా, ఇప్పటికే తెలంగాణలో బండా ప్రకాశ్‌ రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీకి కూడా ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రం నుంచి మొత్తం మూడు రాజ్యసభ స్థానాల ఖాళీలు భర్తీకానున్నాయి.

డబ్లూహెచ్‌వో పై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్, ఇలా ఉంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మారాలన్న ప్రధాని

జూన్‌ 10 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత ఓట్లు లెక్కిస్తారు. రాజ్యసభ ఎంపీలుగా పదవీ విరమణ చేస్తున్నవారిలో కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, అంబికా సోని, జైరాం రమేశ్‌, కపిల్‌ సిబల్‌ ఉన్నారు. ఇక జూన్‌-ఆగస్టు నెలల్లో ఇతర రాష్ట్రాల్లో 55 స్థానాలు ఖాళీ కానున్నాయి.

ఎన్నికల షెడ్యూల్‌

నామినేషన్ల స్వీకరణ మే 24

ఆఖరి తేదీ మే 31

నామినేషన్ల పరిశీలన జూన్‌ 1

ఉపసంహరణ జూన్‌ 3

పోలింగ్‌ జూన్‌ 10