కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ సహా పది మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండటంతో జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది జులై – ఆగస్ట్ మధ్య పశ్చిమ బెంగాల్, గోవా, గుజరాత్ నుంచి ఈ 10 స్థానాలు ఖాళీ అవుతున్నట్లు పేర్కొంది.
అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానం ఖాళీ కానుంది. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జులై 6న విడుదలవుతుందని తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చట్లు, వీడియో ఇదిగో..
గత ఏడాది జులైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాలను నిలబెట్టుకోగా, రాజస్థాన్, మహారాష్ట్రల్లో ఒక్కో స్థానంలో గెలుపొందింది.