Ram Temple Donation Campaign: అయోధ్య రామ మందిరానికి రూ.2 వేల కోట్ల వ‌ర‌కూ విరాళాలు, ముగిసిన రామ మందిర విరాళాల సేకరణ, 44 రోజులపాటు సాగిన కార్యక్రమం
Ayodhya Ram Mandir New Photos (Photo-Twitter)

New Delhi, Feb 28: అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళ‌ల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్య‌క్ర‌మంలో (Ram Temple Donation) దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విరాళాలు సేక‌రించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వ‌ర‌కూ విరాళాలు (Ram Temple Donation Campaign) వ‌చ్చిన‌ట్లు ట్ర‌స్ట్ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఇందులో ఇంకా చాలా వ‌ర‌కు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్న‌ట్లు వాళ్లు తెలిపారు.

ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్త‌యితే.. విరాళాల మొత్తం మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. విరాళాలుగా వ‌చ్చిన మొత్తం సొమ్మును శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. మొత్తం డ‌బ్బును లెక్కించి, ఆడిట్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌డానికి మ‌రో నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అయోధ్య ట్ర‌స్ట్ కార్యాల‌యం ఇన్‌చార్జ్ ప్ర‌కాష్ గుప్తా వెల్ల‌డించారు. ఈ ప్ర‌క్రియను ప‌ర్య‌వేక్షించ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు.

దేశంలో భారీ స్థాయిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా 16,752 మందికి కరోనా, మహారాష్ట్రలో కొత్తగా 8,623 మందికి కోవిడ్, తెలంగాణలో 176 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో 118 మందికి కోవిడ్

ఈ ప్ర‌క్రియ‌లో పాల్గొనే ప్ర‌తి ఒక్క‌రికీ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఇచ్చామ‌ని, వారు ప్ర‌తి రోజూ డేటాను అందులో న‌మోదు చేస్తార‌ని గుప్తా చెప్పారు. 44 రోజుల పాటు సాగిన ఈ విరాళాల ప్ర‌క్రియ దేశ‌వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల గ్రామాల్లోని 11 కోట్ల కుటుంబాల్లో ఉన్న మొత్తం 55 కోట్ల మంది వ‌ర‌కూ చేరింద‌ని ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్ చెప్పారు. పలు చెక్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, మూడు రోజులు సెలవు కావడంతో నగదు డిపాజిట్‌లు నిలిచిపోయాయని తెలిపారు. వాలంటీర్ల వద్ద ఉన్న మిగతా కూపన్లను వెనక్కు తీసుకుంటామని పేర్కొన్నారు.

కాగా అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ గతేడాది ఆగస్టు 5న శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికయ్యే మొత్తాన్ని ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించాలని నిర్ణయించారు.

విరాళాలపై వీహెచ్ఫీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడుతూ.. శ్రీ రామ్ మందిర్ నిధి సమర్పన్ అభియాన్ జనవరి 15 న పవిత్రమైన మకర సంక్రాంతి రోజున ప్రారంభమైంది. ఐదు లక్షల గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లక్షలాది వాలంటీర్ బృందాలు నిర్విరామంగా పనిచేశాయి. దేశ జనాభాలో సగం మందిని కలుసుకున్నారు. సేకరించిన విరాళాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక శాఖలలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. సంబంధిత రశీదులు లేదా కూపన్ నంబర్లతో కూడిన సేకరణ వివరాలు మొబైల్ కోసం ప్రత్యేకంగా రూపొందించాం’ అన్నారు. విరాళాల సేకరణ పారదర్శకంగా సాగిందని తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక బృందం డెవలప్‌‌చేసిన యాప్ ద్వారా మొత్తం ప్రక్రియ జరిగింది అని అన్నారు.