Ram Temple in Ayodhya: అయోధ్యలో శ్రీరాముని ఆలయం కొత్త ఫోటోలు ఇవిగో, ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం, జనవరి 22న రాముని ప్రాణ్-ప్రతిష్ఠ
Ram Temple in Ayodhya

Ayodhya, Dec 8: అయోధ్యలో ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం రామాల‌య(Ayodhya Ram Temple) నిర్మాణం వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆల‌య శిఖ‌రం వ‌ద్ద ప‌నులు జ‌రుగుతున్నాయి. గ‌ర్భ‌గుడి నిర్మాణం పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం ఉంటుంది. రాముడి బాల రూపాన్ని వర్ణించే విగ్రహం 90 శాతం సిద్ధంగా ఉందన్నారు. ఆల‌య ప‌నుల‌కు చెందిన తాజా ఫోటోల‌ను ట్ర‌స్టు రిలీజ్ చేసింది. రామ్‌ల‌లా ప్రాణ ప్ర‌తిష్ట కోసం జోరుగా అక్క‌డ ప‌నులు జ‌రుగుతున్నాయి. తాజాగా ట్ర‌స్టు రిలీజ్ చేసిన ఫోట్లో ఆల‌యం పూర్తిగా ద‌ర్శ‌నం ఇస్తోంది.

దేశంలో తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌ వీడియో ఇదిగో, అండర్‌గ్రౌండ్‌ స్టేషన్‌, ఎత్తైన కారిడార్‌పై ప్రయాణం, 26 కిలోమీటర్ల మేర సొరంగాలు

రామమందిరానికి చెందిన మొద‌టి ఫ్లోర్ ప‌నులు నిర్మాణంలో ఉన్నాయి. గ‌ర్భ‌గుడి పూర్తిగా త‌యారై సిద్ధంగా ఉంది. రామ్‌లల్లాకు చెందిన బాలుడి మూర్తుల‌ను కూడా త‌యారు చేశారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 22వ తేదీన ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్ర‌తిష్ట జ‌ర‌గ‌నున్న‌ది. ఈ కార్య‌క్ర‌మానికి దేశ‌వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలు హాజ‌రుకానున్నారు.

Here's Pics

రామ జన్మభూమి ఆలయంలో, అయోధ్యలోని మూడు ప్రదేశాలలో 5 ఏళ్ల రాముడి రూపాన్ని వర్ణించే 4'3'' విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ముగ్గురు కళాకారులు మూడు వేర్వేరు రాతి ముక్కలపై విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అయోధ్యలో రామ్ లల్లా (శిశువు రాముడు) యొక్క ప్రాణ్-ప్రతిష్ఠ (పవిత్ర) వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.