Shaktikanta-Das

New Delhi, August 5: అందరూ ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI0 మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెంచింది. నిపుణులు, విశ్లేషకుల అంచనాకనుగుణంగానే రెపో రేటును 50 బీపీఎస్‌ పాయింట్లు మేర పెంచుతూ (RBI Hikes Repo Rate) నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. తాజా పెంపుతో రెపో రేటు 5.4 శాతంగా ఉంచింది.

అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌) 5.15 శాతానికి సర్దుబాటు చేసింది.జీడీపీ వృద్ధి అంచనా 7.2శాతంగా అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సహజంగానే ప్రభావితమవుతోందని ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. త్వరలోనే వంటనూనెలు దిగి రానున్నాయని ఆయన చెప్పారు. గత మూడు నెలల్లో రెపో రేటును పెంచడం ఇది వరుసగా మూడోసారి. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేృత్వత్వంలో మూడు రోజుల సమావేశాల అనంతరం కమిటీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఈ రేటు పెంపునకే మొగ్గు చూపింది.

సుప్రీంకోర్టు త‌దుప‌రి చీఫ్ జ‌స్టిస్‌గా యుయు ల‌లిత్, సిఫారసు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసిన చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే (Repo Rate) వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు శుక్రవారం ప్రకటించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు 35 బేసిస్‌ పాయింట్లు కాకుండా ఆర్‌బీఐ మరింత అధిక పెంపునకు మొగ్గుచూపింది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్‌బీఐ (RBI) వరుసగా మూడోసారి రెపోరేటు (Repo Rate)ను పెంచింది.రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఆర్‌బీఐ మే-జూన్‌ నెలల్లో రెండు విడతలుగా ఆర్‌బీఐ రెపో రేటును 90 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచింది. ఆ భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించాయి. తాజా మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదా (EMI)లు మరింత భారం కానున్నాయి.

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు.. వృద్ధికి సహకారం అందించేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్‌బీఐ గత సమీక్షలోనే తెలిపింది. అంటే రెపోరేటు మరింత పెంచుతామనే సంకేతాలు అప్పుడే ఇచ్చింది. ఈనెల 3న ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల (Monetary Policy Committee decisions)ను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ (Shaktikanta Das) శుక్రవారం వెల్లడించారు.