New Delhi, Sep 30: కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్‌బీఐ కీలక నిర్ణయ తీసుకుంది. ఈ నేపథ్యంలో రెపో రేటు (RBI Hikes Repo Rate) 50 బేసిస్ పాయింట్లు పెంచింది. శుక్రవారం ఉదయం ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 0.50 శాతానికి (50 Basis Points To 5.90%) పెంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌కు రెపో రేటు ప్ర‌కారం ఆర్బీఐ రుణాలు అంద‌జేస్తుంది.

అయితే రెపో రేటు పెర‌గ‌డం వ‌ల్ల కార్పొరేట్లు, వ్య‌క్తిగ‌త క‌స్ట‌మ‌ర్ల‌కు ఇక నుంచి రుణాలు మ‌రింత భారంకానున్నాయి. 50 బేసిస్ పాయింట్లు పెంచ‌డం వ‌ల్ల రెపో రేటు 5.90శాతానికి పెరిగింది. తొలి క్వార్ట‌ర్‌లో జీడీపీ అంచ‌నాల‌కు మించి త‌గ్గిన‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణం 7 శాతం ఉంద‌ని, రెండ‌వ క్వార్ట‌ర్‌లో 6 శాతానికి చేరుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు.

ఈ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మే నెల నుంచి పెంచుతూ వచ్చింది.

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డీ మ్యాట్ అకౌంట్ ఉందా? అయితే అక్టోబర్ 1 లోగా ఈ పనులు చేయకపోతే నష్టపోతారు, అక్టోబర్ నెల నుంచి జరుగనున్న ఐదు మార్పులు ఇవే!

తాజాగా మరో సారి పెంచడంతో బ్యాంకులు రుణగ్రస్తులకు అందించే రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తద్వారా హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌ ఇలా బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లపై నెలవారీ చెల్లించే ఈఎంఐ మరింత పెరగనుంది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేట్లను రెపోరేట్లు అని అంటారు.

దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపోరేట్లను పెంచుతూ వస్తుంది. ఇలా మే నెలలో 0.40శాతం, జూన్‌, ఆగస్టులో 0.5శాతం, శుక్రవారం మరో 0.5శాతం పెంచాయి. కాగా, ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచిన ప్రతిసారి.. బ్యాంకులు ఇచ్చే లోన్‌లపై వడ్డీ రేట్లను పెంచే విషయం తెలిసిందే.