RBI, Mastrecard. (Photo Credits: PTI | Wikimedia Commons)

New Delhi, July 14: ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భారీ (RBI Restricts Mastercard) షాకిచ్చింది. ఈ నెల 22 నుంచి కొత్తగా భారతీయ వినియోగదారులెవరినీ చేర్చుకోవద్దని తాజాగా ఆదేశించింది. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ విభాగాలు మూడింటికీ ఇది వర్తిస్తుందని (RBI Imposes Restrictions on Mastercard) పేర్కొంది. చెల్లింపుల సమాచారం నిల్వకు సంబంధించిన నిబంధనలను మాస్టర్‌కార్డ్ ఉల్లంఘించిందని ఆర్‌బీఐ ఈ సందర్భంగా పేర్కొంది. అయితే.. ప్రస్తుత కస్టమర్ల విషయంలో మాస్టర్‌కార్డ్ (Mastercard) యథాతథంగా తన సేవలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కొత్త మాస్టర్ కార్డ్ కార్డులను జారీ చేయకుండా నిషేధం జూలై 22 నుంచి అమల్లోకి వస్తుంది. "తగినంత సమయం, ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికి వినియోగదారుల పేమెంట్స్ డేటా నిల్వ విషయంలో ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదని" సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిబందన వల్ల ఇప్పటికే మాస్టర్ కార్డ్ ఉన్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదు. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్‌ 6న మాస్టర్‌ కార్డ్‌కు ఆర్‌బీఐ ఆదేశించింది.

మొబైల్ హీటెక్కుతోందా.. పరిష్కారం చిక్కడం లేదా, అయితే ఈ సింపుల్ చిట్కాల ద్వారా మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని హీట్ నుంచి రక్షించుకోండి

అప్పటి నుంచి డేటా నిల్వ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007(పీఎస్ఎస్ చట్టం) సెక్షన్ 17 కింద చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. మాస్టర్‌ కార్డ్‌కు పీఎస్ఎస్ చట్టం కింద దేశంలో కార్డు నెట్ వర్క్ ఆపరేట్ చేయడానికి అధికారం ఇచ్చారు. గతంలో డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజమాన్యంలోని అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కార్డులపైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది.