mobile using (Photo-ANI)

సాధారణంగా ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్ల వారి మొబైల్స్ ఒక్కోసారి బాగా హీటెక్కుతూ (Phone Overheating Issue) ఉంటాయి.ఈ వేడి దెబ్బకి ఒక్కోసారి మొబైల్స్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొబైల్ హీటెక్కడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా కనిపించే కారణాలతో మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు (How to fix Android phone overheating issue) కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించినట్లయితే (Check Here some Solution tips) మన ఫోన్ ని ఓవర్ హీట్ నుండి రక్షించుకోవచ్చు.

ప్రతి కంపెనీ మొబైల్ తయారీ సమయంలో దాని మీద డూప్లికేట్ ఛార్జింగ్ కేబుల్స్ ఉపయోగించకూడదని రాసి ఉంటుంది. దీని వల్ల ఫోన్ బ్యాటరీ పాడయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ హీటెక్కడానికి కూడా ఇది ప్రధాన కారణం. కాబట్టి ఒరిజినల్ ఛార్జర్ ని మాత్రమే ఉపయోగించండి. మీరు మీ ఫోన్ ఛార్జింగ్ సమయంలో ఇది చెక్ చేసకోవాలి. డే సమయంలో అయితే కేవలం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. రాత్రి వేళ అయితే 100 శాతం ఛార్జింగ్ అయ్యేలా చూసుకోండి.

ఎదురులేని జియో, 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌, కొత్త స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకోవడంలో టాప్, వైర్‌లెస్ స‌బ్‌స్క్రైబ‌ర్ల జాబితాలో 427.67 మిలియ‌న్ల యూజ‌ర్ల‌తో అగ్ర స్థానంలో ముకేష్ అంబానీ జియో

వైఫై కి ఫోన్ హీటింగ్ కి సంబంధం ఉండకపోవచ్చు. కాని ఒక్కోసారి దీని వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వైఫై ఉన్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. కాబటటి వైఫై ఉన్న సమయంలో ఈ యాప్స్ ని మీరు చెక్ చేసుకోండి. మీరు బ్లూటూత్ కాని జీపీఎస్ కాని అవసరం ఉన్నప్పుడే ఆన్ చేయడం. అనవసర టైంలో ఆన్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఫోన్ హీట్ కూడా ఎక్కుతుంది.చాలామంది ఈ ఫీచర్ బాగుందని దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇది బ్యాటరీని తినేస్తుంది. మీకు తెలియకుండానే వెనుక యాప్స్ రన్ అవుతుంటాయి. కాబట్టి దీనికి కొంచెం దూరంగా ఉండండి.

మీ ఫోన్ వాడకం వీలయినంతగా తగ్గిస్తే చాలా మంచింది. 24 గంటలు దానితోనే ఉండటం వల్ల మీ మొబైల్ కే కాకుండా మీకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తే చాలామంచిది. లైవ్ స్ట్రీమింగ్ జోలికి వెళ్లకండి ఒక వేళ వెళ్లినా వీలయినంత తక్కువ సమయం కేటాయించండి. ఫోన్ ఉంటే అందరూ గేమ్స్ మీదకే తమ దృష్టిని మరల్చుతారు.అయితే ఇది చాలా ప్రమాదం. దీన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.

మీ పాన్ కార్డు ఒరిజినల్ లేక నకిలీదో గుర్తించడం ఎలా? కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని మోసానికి పాల్పడుతున్న మోసగాళ్లు, మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? ఈ కింది పద్దతుల ద్వారా తెలుసుకోండి

ఫోన్ అందంగా కనపడాలని ఏవేవో కవర్లు వేస్తుంటారు. వాటి జోలికి వెళ్ళవద్దు. ముఖ్యంగా Plastic, Leather Caseల జోలికి అసలు వెళ్లవద్దు. బ్యాటరీ డ్యామేజి అయిందని తెలిస్తే దాన్ని వెంటనే మార్చుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది.అలాగే మీ ఫోన్ ని వాటర్ కి వీలయినంత దూరంగా ఉంచండి. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో మ్యూజిక్ వినడం లాంటి పనులు చేయవద్దు. మీరు ఫోన్ వాడే సమయంలో ఫోన్ బ్రైట్ నెస్ ని వీలయినంతగా తగ్గించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎక్కువ బ్రైట్ నెస్ మీ ఫోన్ బ్యాటరీని తినేస్తుంది. కాబట్టి మీకు ఎంత కావాలో అంత మాత్రమే సెట్ చేసుకోండి.

కూలింగ్ యాప్స్ జంక్ ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. దీనికోసం కొన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడండి. అలాగే ఫోన్ కూలింగ్ యాప్స్ వాడండి. Cooling Master-Phone Cooler,Device Cooler Heat Minimizer,Device Cooler - Cooling Master,Coolify లాంటి యాప్స్ వాడటం ద్వారా మీ ఫోన్ కూల్ గా ఉంచుకోవచ్చు.