PAN Verification: మీ పాన్ కార్డు ఒరిజినల్ లేక నకిలీదో గుర్తించడం ఎలా? కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని మోసానికి పాల్పడుతున్న మోసగాళ్లు, మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? ఈ కింది పద్దతుల ద్వారా తెలుసుకోండి
Get PAN card instantly without detailed application form (photo-Twitter)

దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్య మైనదో అదే మాదిరిగా పాన్ కార్డు (PAN Card) కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనది. బ్యాంక్ ఖాతా దగ్గర నుంచిహోమ్ లోన్, పర్సనల్ లోన్ వరకు ఏది తీసుకోవాలన్న పాన్ కార్డు తప్పనిసరి అయింది. ఇంకా శుభవార్త ఏంటంటే అప్లయి చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పాన్ కార్డులను జారీ చేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో ద్వారా పాన్‌ కార్డు (Online P​AN Verification) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్‌ కార్డు ఉంటే చాలు కేవలం నిమిషాల్లోనే ఈ-పాన్‌కార్డును తీసుకోవచ్చు. ఎన్ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్ల ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.

అయితే కొందరు మోసాగాళ్లు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని పాన్ కార్డ్ విషయంలో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు నకిలీ కార్డులను సృష్టించి సొమము చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఇతరులు మీకు పాన్ కార్డు ఇస్తే అందులో ఇచ్చిన వివరాలు నిజమైనవేనా (PAN Card Verification) అనే గుర్తించే అవకాశం ఇప్పుడు ఉంది. అందువల్ల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? అని సులభంగానే తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

సీక్రెట్ ఇదే..అంతరిక్షంపై కన్నేసిన జెఫ్ బెజోస్, అమెజాన్ సీఈఓ పదవికి గుడ్ బై, అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌తో ఎక్కువ సమయం గడపనున్న బిలియనీర్, అమెజాన్ కొత్త సీఈఓగా ఆండీ జాస్సీ

నకిలీ పాన్ కార్డు గుర్తించడం ఎలా..?

ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.

Our Service విభాగంలో 'Verify Your PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేసి 'Continue' మీద చేయాలి.

ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేసి "ప్రొసీడ్" నొక్కాలి.

ఇప్పుడు ఆ పాన్ సరైనది అయితే, "PAN is Active and details are as per PAN" అనే మెసేజ్ వస్తుంది.

ఇలా వస్తే పాన్ కార్డు ఒరిజినల్ అని అర్ధం లేకపోతే నకిలిదీ అని గుర్తుంచుకోవాలి. పైన చెప్పిన విధంగా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మన పేరు మీదనే నకిలీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.