Amazon CEO & Founder Jeff Bezos (Photo Credits: IANS)

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాను స్థాపించి, పెంచి పెద్ద చేసిన అమెజాన్‌కు సీఈఓ పదవికి (Jeff Bezos Steps Down as Amazon CEO) గుడ్ బై చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మార్చిన అమెజాన్‌ కంపెనీ సీఈవో పదవికి జులై 5న ఆయన (Billionaire Jeff Bezos) రాజీనామా చేశారు. అమెజాన్‌ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ (Andy Jassy) పదవీ బాధ్యతలు స్వీకరించారు. పుస్తకవిక్రేత నుంచి అమెజాన్ అధిపతిదాకా ఎదిగిన బిలియనీర్ సరికొత్త అవకాశాలను వెతుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెజాన్ సంస్థను... ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సంస్థల్లో ఒకటిగా ఆయన తీర్చిదిద్దాడు. రెండున్నర దశాబ్దాల క్రితం స్థాపించిన కంపెనీ...టెక్నాలజీ / ఇ-కామర్స్ విభాగాల్లో ఇక మీదట ఎగ్జిక్యూటివ్‌గా గానే కొనసాగుతారు.

ఈ కామర్స్‌ రంగానికి కొత్త అర్థం చెప్పి అత్యంత విజయవంతమైన కంపెనీగా అమెజాన్‌ రూపొందింది. ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతున్న తొలి రోజుల్లోనే 1994లో అమెరికాలోని ఒ కార్ల షెడ్డులో అమెజాన్‌ తన కార్యకలాపాలు ప్రారంభించింది. జెఫ్‌ బేజోస్‌ అతని టీం అనుసరించిన వ్యూహాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్‌ సంస్థగా మారింది. అమెజాన్‌ సీఈవో కమ్‌ చైర్మన్‌గా ఉన్న జెఫ్‌ బేజోస్‌ ఈప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు. అయితే సోమవారం ఆయన తన పదవుల నుంచి తప్పుకున్నారు.

సెక్షన్ 66 A కింద కేసులు నమోదు, రద్దయిన చట్టం కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం, కేంద్రానికి నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

హర్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి 1997లో ఎంబీఏ పట్టా తీసుకున్న తర్వాత అప్పటికే స్టార్టప్‌ స్టేజ్లో ఉన్న అమెజాన్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఆండీ జాస్సీ చేరాడు. ఆ తర్వాత జెఫ్‌ బేజోస్‌తో కలిసి పని చేస్తూ కంపెనీనీ ఊహించని ఎత్తులకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. పది లక్షల మందికి పైగా ఉపాథి కల్పించిన బెజోస్‌కు మంచి ముందుచూపున్న వ్యాపారవేత్తగా పేరుంది. అమెజాన్ మార్కెట్ విలువ ఇప్పుడు1.7 ట్రిలియన్ డాలర్లు అంటే.. రూ.127.5 లక్షల కోట్లు. ఇ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కిరాణా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్ట్రీమింగ్, మీడియా సహా మరెన్నో కంపెనీల ద్వారా 2020లో ఆయన వార్షికాదాయం 386 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

సెకండ్ వేవ్‌లో యువతే ఎక్కువగా కరోనా బారీన పడ్డారు, దేశంలో కొత్తగా 39,796 కరోనా కేసులు, నిన్న ఒక్కరోజు 723 మంది కరోనాతో మృతి, దేశంలో ప్రస్తుతం 4.82 లక్షల యాక్టివ్ కేసులు

అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌తో సహా ప్రాజెక్టులపై ఎక్కువ సమయం గడపడానికి బెజోస్ రోజువారీ అమెజాన్ నిర్వహణ నుండి వైదొలగనున్నాడు. అంతేకాదు ఇటీవల ఆయన భార్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెలఖరులో ఆయన అంతరిక్షయానం చేయనున్నాడు. అంతరిక్షపు అంచులను తాకడమే లక్ష్యంగా ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్‌’, ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’‌, వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రారంభించిన ‘బెజోస్ ఎర్త్ ఫండ్’‌, డే 1 ఫండ్‌ ప్రాజెక్టులపై బెజోస్‌ దృష్టి సారించనున్నారు.

ముఖ్యంగా బ్లూ ఆరిజిన్‌పై ఆయన అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. తన సోదరుడు మార్క్‌ బెజోస్‌తో కలిసి త్వరలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. దీంతో అంతరిక్ష పర్యాటకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు.దీంతో పాటుగా డే 1 ఫండ్‌ ద్వారా బెజోస్‌.. ఇల్లు లేని నిరాశ్రయులను ఆదుకోనున్నారు. అలాగే విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. మరోవైపు 10 బిలియన్ డాలర్లతో ప్రారంభించిన ఎర్త్‌ ఫండ్‌ ద్వారా వాతావరణ మార్పులపై పోరే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించారు. స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా అనేక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అలాగే 2013లో 250 మిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాషింగ్టన్‌ పోస్ట్‌ మీడియాను ప్రజలకు మరింత చేరువచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.