RBI 'War Room': ప్రపంచంలో ఫస్ట్ టైం, ఆర్‌బీఐ రహస్య వార్ రూమ్, వ్యాపార విపత్తు ప్రణాళికను అమల్లోకి తెచ్చిన రిజర్వ్ బ్యాంక్, కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు
దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి (coronavirus outbreak) కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (BCP)ని అమల్లోకి తెచ్చింది. 24 గంటల వ్యవధిలో ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ (RBI War Room) ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు.
Mumbai, Mar 23: దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి (coronavirus outbreak) కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (BCP)ని అమల్లోకి తెచ్చింది. 24 గంటల వ్యవధిలో ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ (RBI War Room) ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు.
కరోనా కల్లోలం, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బిఐ
ఈ వార్ రూంలో రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతరత్రా విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్ 70 మంది విధులు నిర్వర్తిస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ వార్ రూమ్ ద్వారా ప్రత్యేకంగా డెట్ నిర్వహణ, రిజర్వుల నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలా పాలు పర్యవేక్షిస్తుందని సమాచారం.
బీసీపీ కింద నగదు బదిలీ లావాదేవీ సేవలైన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ (SFMS) మొదలైనవి పర్యవేక్షిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ–కుబేర్, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల్లాంటివి కూడా వీటిలో ఉంటాయని తెలుస్తోంది.
యెస్ బ్యాంకులో ఉన్న ప్రజల సొమ్ము భద్రం
అయితే ఇలాంటి వార్ రూం ప్రపంచంలో ఎక్కడా అమలు చేయలేదని, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కూడా ఇలాంటివి జరగలేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. ఒక కేంద్రీయ బ్యాంకు ఇలాంటి బీసీపీని అమలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని అన్నారు. సాధారణంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమస్యలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మొదలైన వాటికి మాత్రమే బీసీపీ (Business Contingency Plan (BCP) లాంటిది ఉంటుంది. కానీ కరోనా వైరస్ మహమ్మారితో యుద్ధంలో ఆర్‌బీఐ ప్రకటించిన బీసీపీ లాంటిది మరెక్కడా లేదని చెప్పారు.
యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన వద్దు
దేశవ్యాప్తంగా 31 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంలో 14,000 మంది పైగా సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలక కార్యకలాపాలను 1,500 మంది దాకా సిబ్బంది నిర్వహిస్తుంటారు. ప్రధాన కార్యాలయంలో 2,000 దాకా సిబ్బంది ఉండగా గత వారం రోజులు నుంచి కేవలం 10% మందే విధులకు హాజరవుతున్నారు.
డెబిట్, క్రెడిట్ కార్డులను వెంటనే వాడండి
ముంబైలోని వార్ రూంలో 150 మంది ఆర్‌బీఐ సిబ్బంది, 60 మంది సర్వీస్ ప్రొవైడర్లు, 70 శాతం మంది ఫెసిలిటీ స్టాఫ్ (మెయింటెనెన్స్, సెక్యూరిటీ, కిచెన్, ఫ్రంట్ డెస్క్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల వారు)కి సరిపడే ఒక భవంతిని ఆర్‌బీఐ తీసుకుంది. ఈ సిబ్బంది అందరూ నిరంతరం ఆ భవంతిలోనే ఉంటారు. తీవ్ర విపత్తు పరిస్థితులైతే తప్ప బైటికి రావడానికి ఉండదు. వారందరికీ అవసరమైన వాటిని అత్యంత పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, సరఫరా చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. రెండు బ్యాచ్‌ల కింద వార్ రూమ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు.
యస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్
కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కరెన్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నోట్లను లెక్కపెట్టిన తర్వాత, ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సూచించింది. సాధ్యమైనంత వరకూ బ్యాంకు శాఖలకు వెళ్లకుండా ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్‌ను వినియోగించాలని కోరింది. ఇందులో భాగంగా ‘కరోనా సే డరో న, డిజిటల్ కరో నా‘ (కరోనాతో భయం వద్దు.. డిజిటల్ సర్వీసులు ఉపయోగించుకోండి) అనే ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.
(The above story first appeared on LatestLY on Mar 23, 2020 05:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

