Bus falls in gorge in Jammu and Kashmir after terror attack (Photo Credit: X/@ashraf_wani)

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు. రియాసీ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

ఈ బస్సు శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళుతోంది. తెర్యాత్‌ గ్రామం వద్ద ఈ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో వాహనంపై అతడు నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. 9 మృతదేహాలను వెలికితీసినట్లు రియాసీ జిల్లా సీనియర్‌ ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులని భావిస్తున్నారు.  అయ్యో పాపం, కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ మృతి, 4 గంటలు పాటు స్తంభం మీదనే మృతదేహం

ఈ దాడి పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీతో మాట్లాడి ఘటనపై సమాచారం తెలుసుకున్నానని, ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదన్నారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. వెంటనే వైద్యసేవలు అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తుందని చెప్పారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Here's Videos

వదిలేది లేదు: అమిత్‌ షా

యాత్రికులపై దాడి బాధాకరమని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. దీనికి బాధ్యులైన వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. ఈ దాడికి తెగబడ్డ ముష్కరులను పట్టుకోవడానికి సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు వేట ప్రారంభించాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) కూడా రియాసికి చేరుకుంది. సంఘటన స్థలంలో, చుట్టుపక్కల దట్టమైన అటవీ ప్రాంతాలలో శోధన ఆపరేషన్‌లో డ్రోన్‌లను కూడా ఉపయోగిస్తున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శివ్ ఖోరీ మందిరం నుండి కత్రాకు వెళుతున్న బస్సు రాజౌరీ జిల్లా సరిహద్దులోని రియాసి జిల్లాలోని పౌని ప్రాంతానికి చేరుకున్నప్పుడు సాయంత్రం 06.10 గంటలకు ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు లోయలోకి దూసుకెళ్లిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) రియాసి మోహిత శర్మ ANIకి తెలిపారు.

సహాయక చర్యలు పూర్తయ్యాయని, క్షతగాత్రులను నరైనా, రియాసీ జిల్లా ఆసుపత్రులకు తరలించామని ఎస్‌ఎస్పీ తెలిపారు. "ప్రయాణికుల గుర్తింపులు నిర్ధారించబడలేదు. ప్రాథమిక నివేదికలు వారు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని సూచిస్తున్నాయి," అన్నారు.