Mumbai, August 15: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ (Mukesh Ambani Get Threat Calls) వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన హరికిషన్‌దాస్ ఆస్పత్రి నెంబర్‌కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Reliance Industries chairman), ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రిలయన్స్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసిందని ముంబై పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖేష్ అంబానీ లక్ష్యంగా మూడుకు పైగా బెదిరింపు కాల్స్ (Mukesh Ambani Family Get Fresh Threat Calls) వచ్చాయని సమాచారం. ఈ వ్యవహారంపై డీబీ మార్గ్ పోలీసులు మరిన్ని వివరాలను రాబడుతూ దర్యాప్తును వేగవంతం చేశారు.
కాగా గత ఏడాది ముంబైలో ముఖేష్ అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్ధాలతో కూడిన స్కార్పియో కారు, బెదిరింపు లేఖను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్ సజిన్ వజే సారధ్యంలో దర్యాప్తు చేపట్టగా ఆపై స్కార్పియో యజమాని, ధానేకు చెందిన వ్యాపార వేత్త మన్సుక్ హిరేన్ అనుమానాస్పద మృతి అనంతరం కేసును ఎన్ఐఏకు బదలాయించారు