Mumbai, April 8: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష (Monetary Policy Review) జరిగింది. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కీలకమైన వడ్డీ (రెపో, రివర్స్ రెపో) రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెంచుతుందని అంతా భావించారు. కానీ, ఆర్బీఐ మాత్రం ఇటు పెంచడంగానీ, తగ్గించడంగానీ చేయలేదు. పాత రేట్లనే యథాతథంగా ఉంచేసింది. దాని వల్ల రుణాలు తీసుకునేవారిపై పెద్దగా ప్రభావమేమీ పడకపోయినా.. ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు మాత్రం మింగుడుపడని విషయమే.

రెపోరేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే ఆర్బీఐ స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం 2022 -2023లో ఆర్ధిక వృద్ధిరేటు 7.2శాతంగా ఉంటుందని అంచనా వేశారు.మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 16.2 శాతం, రెండవ త్రైమాసికంలో 6.2 శాతంగా ఉండనుంది. ఇక సెకండ్ అడ్వాన్స్‌డ్ అంచనాల ప్రకారం..ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022లో జీడీపీ వృద్ధి 8.9 శాతంగా నిర్ణయించబడిందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంద్‌ దాస్‌ అన్నారు.

ఎండాకాలంలో వాహనంలో పెట్రోల్ కాని డీజిల్ కాని పుల్ ట్యాంక్ కొట్టిస్తే పేలిపోతాయా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌పై క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆయిల్ కంపెనీ

బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు కాబట్టి.. రుణాలు తీసుకోవాలనుకునేవారిపై పెద్దగా ప్రభావం ఉండే అవకాశం లేదు. అయితే, తక్కువ వడ్డీ రేటు ఇలాగే ఎక్కువ కాలం ఉంటుందనీ అనుకోలేం. ప్రస్తుతానికైతే రుణాలు తీసుకునేవారికి కొంత మేర లాభమే. గృహ రుణాలు సాధారణంగానే దీర్ఘకాలం పాటు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు రేట్లు పెరిగినా..తగ్గినా మిగతా రుణం, వడ్డీపై ప్రభావం భారీగానే ఉంటుంది.

అయితే, కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలనుకుంటున్న వాళ్లకు ప్రస్తుతం సరైన సమయం. ఇంకొన్నాళ్ల పాటు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లే ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా బ్యాంకులు లేదా సంస్థలు ఫ్లోటింగ్ రేటు ఆధారంగానే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఆర్బీఐ దాన్ని తప్పనిసరి చేసింది కూడా. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగానే గృహ రుణాల వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రెపోలో ఎలాంటి మార్పులు లేనందున ఇంకొన్నాళ్లు తక్కువ వడ్డీనే ఉంటుంది. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వాళ్లు ఒకసారి తమ తమ లోన్లను రివ్యూ చేసుకుంటే మంచిది. గృహ రుణం తీసుకుని ఐదేళ్లు దాటి ఉంటే బేస్ రేట్(బీపీఎల్ఆర్), ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ రేట్– ఈబీఆర్ (ఎంసీఎల్ఆర్)లను పరిశీలించుకోవాలి. ప్రస్తుతం లోన్ దేని పరిధిలో ఉందో చూసుకోవాలి.

విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్, తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన మద్రాస్ హైకోర్టు

ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ కు అనుసంధానించిన లోన్ కు తీసుకున్న గృహ రుణం బదిలీ కాలేదంటే ఎక్కువ వడ్డీని కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ వడ్డీ కడుతున్నట్టు అనిపిస్తే వెంటనే గృహ రుణం తీసుకున్న సంస్థను సంప్రదించాలి. లోన్ ను ఈబీఆర్ కు మార్చుకునేందుకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. దానికి కొంత ఫీజును వసూలు చేస్తారు. ఒకవేళ మార్చుకునే అవకాశం ఇవ్వకపోయినా.. ఉన్న ఈబీఆర్ లింక్డ్ హోమ్ లోన్ పైనే ఎక్కువ వడ్డీని వసూలు చేసినా వెంటనే రుణాన్నిచ్చే సంస్థను మార్చడం మేలు. వేరే సంస్థకు లోన్ ను బదిలీ చేసుకుంటే మంచిది. వడ్డీ రేట్లలో తేడా 0.5 శాతం లేదా అంతకన్నా ఎక్కువుంటేనే మార్చుకోవాలన్నది నిపుణుల సూచన.

కార్ లేదా వాహన రుణాల కాల పరిమితి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం కారు రుణాలను తీసుకునే వారికి మంచి తరుణం. సాధారణంగా వాహన రుణాలన్నింటినీ ఫిక్స్ డ్ రేట్లపైనే ఇస్తుంటారు. కాబట్టి రెపో రేట్లలో ఎలాంటి మార్పు లేనందున ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోన్ తీసుకుంటే అదే వడ్డీ రేటు మనం తీసుకునే కాలపరిమితి వరకు కొనసాగుతుంది. ఇక కొత్తగా వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఇప్పుడు సరైన సమయమే. మరికొన్నాళ్లపాటు తక్కువ వడ్డీ రేట్లే కొనసాగే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు వచ్చే వీలుంటుంది. ఒకవేళ ఇప్పటికే వ్యక్తిగత రుణాలను తీసుకుని ఉండి ఉంటే.. వడ్డీ రేటు 16 శాతం కన్నా ఎక్కువుంటే వెంటనే లోన్ ను తక్కువ వడ్డీకిచ్చే సంస్థకు మార్చుకుంటే మేలు. పర్సనల్ లోన్ కాలపరిమితి మామూలుగా 3 నుంచి ఐదేళ్ల మధ్యే ఉంటుంది కాబట్టి.. వడ్డీ రేటు తగ్గితే చాలా వరకు లాభం ఉంటుంది.

రోజులో 24 గంటల పాటు ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను బ్యాంకులు ప్రారంభించుకోవచ్చని ఆర్‌బీఐ (Reserve Bank of India) ప్రకటించింది. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 75జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 75డిజిటల్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడం తెలిసిందే. ఖాతాలు తెరవడం, నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, కేవైసీ నవీకరించడం, రుణాల మంజూరు, ఫిర్యాదుల నమోదు సేవలను డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల ద్వారా అందించొచ్చంటూ ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. కస్టమర్లను చేర్చుకోవడం దగ్గర్నుంచి, వారికి సేవలు అందించడం వరకు కస్టమర్లే స్వయంగా పొందడం, లేదా సహాయకుల విధానంలో అందించొచ్చని పేర్కొంది.

డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్‌ అన్నది కనీస మౌలిక సదుపాయాలతో, డిజిటల్‌ రూపంలో సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన వసతిగా అర్థం చేసుకోవచ్చు. డిజిటల్‌ బ్యాంకింగ్‌లో అనుభవం కలిగిన షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు అనుమతి అవసరం లేకుండానే టైర్‌–1 నుంచి టైర్‌–6 వరకు పట్టణాల్లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను తెరుచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.

ఎగుమతులు–దిగుమతులు (ఎగ్జిమ్‌), ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్‌కు పెద్దపీట వేయడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టి సారిస్తోంది. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్ధీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతిపాదించింది.

ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల ప్రక్రియను ఈ కామర్స్‌ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్‌లైన్‌ ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ ఫెసిలిటేటర్స్‌’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్‌బీఐ ప్రకటన సూచించింది.

3,000 డాలర్లకు మించని విలువైన వస్తువులు, డిజిటల్‌ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో దిగుమతి చేసుకోవడానికి ఈ కామర్స్‌ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంటుందని సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతిపాదించింది. ఎగుమతుల విషయంలో ఈ విలువ 15,000 డాలర్ల వరకూ ఉంది. ప్రస్తుతం వస్తువులు, సేవల ఎగుమతులు, అలాగే వస్తువులు, సాఫ్ట్‌వేర్‌ల దిగుమతికి సంబంధించి చెల్లింపు ప్ర క్రియ నిర్వహించడానికి బ్యాంకింగ్‌కు అనుమతి ఉంది. దీనిప్రకారం ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సర్వీ స్‌ ప్రొవైడర్‌లతో (ఓపీజీఎస్‌పీలు) స్టాండింగ్‌ కాంట్రాక్ట్‌లోకి ప్రవేశించడం ద్వారా దిగుమతి, ఎగు మతి సంబంధిత రెమిటెన్స్‌ల ప్రాసెసింగ్, సెటిల్మెంట్‌ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.