BRS Harish Rao Shocking Comments on Telangana CM Revanth Reddy(X)

Hyderabad, DEC 05: కాంగ్రెస్‌ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోదంటూ మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) మండిపడ్డారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. గురువారం రాత్రి గచ్చిబౌలి పీఎస్‌ నుంచి విడుదలైన అనంతరం హరీష్‌రావు (Harish Rao Released) మాట్లాడుతూ, ఎఫ్‌ఐఆర్‌లు (FIR) పోలీస్‌స్టేషన్‌ నుంచి కాదు.. గాంధీభవన్‌ నుంచి వస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనపైనే ఆయన దృష్టి. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్‌ పేపర్‌పై సంతకాలు చేసి. ప్రజల కాళ్లా వేళ్లా పడి ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు అమలు చేయాలని మేం అడుగుతున్నాం.. తప్పా?. రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. అవ్వాతాతలకు 4వేల పెన్షన్‌ ఇస్తానన్నావ్‌ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy Rule In Sadistic Fraser Says Harish Rao

 

కాగా, అంతకు ముందు మాజీ మంత్రి హరీష్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ దగ్గర బీఆర్‌ఎస్‌ (BRS) నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని గంటల పాటు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌నేతలు కలిశారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగిన తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.