Fire (Representational image) Photo Credits: Flickr)

Jaipur, Jan 17: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా మహేష్‌పూర్‌లో బస్సుకు కరెంటు వైర్ తగిలి మంటలు (Bus Fire Accident In Rajasthan) చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే బస్సు దగ్ధమయ్యింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సజీవదహనం (Rajasthan Tragedy) అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. జోధ్‌పూర్ ఆస్పత్రిలో మరో 17 మందికి చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు రోజుల క్రితం కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దార్వాడ్ జిల్లా ఇట్టిగట్టి వద్ద జరిగిన ప్రమాదంలో మినీ బస్సును టిప్పర్ ఢికొట్టడంతో మినీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. 11 మంది మహిళా వైద్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరుగురు మహిళా వైద్యులు తుది శ్వాస విడిచారు.

CM of Karnataka Tweet

దీంతో మృతి చెందిన వారి సంఖ్య 17 కి చేరింది. ఇంకా మిగిలిన 11 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాళ్లు, చేతులు విరిగిపోయి, వెంటిలెటర్ సాయంతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

డబ్బులు కావాలంటూ బ్యాంకుకు వచ్చిన శవం, బిత్తరపోయిన కెనరా బ్యాంక్ అధికారులు, తన సొంత డబ్బులు ఇచ్చి దహన సంస్కారాలు చేయించిన బ్యాంకు మేనేజర్, అసలు కథ ఏంటంటే..

కర్నాటక సీఎంకు ట్వీట్ చేసి ఘటనపై ఆరా తీసారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం.దాదాపు 30 యేండ్ల తర్వాత పూర్వవిద్యార్థుల సమ్మేళనం కోసం మినీ బస్సులో గోవాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది డాక్టర్ల బృందం ధవనగిరి జిల్లా సెయింట్ పాల్స్ స్కూళ్లో కలిసి చదువుకున్న విద్యార్థులు. వీరంతా ఈ దుర్ఘటనలో కన్నుమూయడంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.