Same-Sex Marriage: ఇదెక్కడి విడ్డూరం..అమ్మాయిని పెళ్లాడిన మరో అమ్మాయి, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, కలిసి జీవించడానికే ఆ అమ్మాయిలు డిసైడ్ అయ్యారని తెలిపిన గురుగ్రామ్ పోలీసులు
హర్యానాలో వింత పెళ్లి జరిగింది. ఆ రాష్ట్రంలో గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలికను (Same-Sex Marriage) పెళ్లాడింది.
Gurugram, June 13: హర్యానాలో వింత పెళ్లి జరిగింది. ఆ రాష్ట్రంలో గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలికను (Same-Sex Marriage) పెళ్లాడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వీరు ఇద్దరూ మంచి స్నేహితులు. జాజర్ జిల్లాలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవాళ్లు కాదు. అలా 7 సంవత్సరాల స్నేహాం (Friends for 7 Years) కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్నారు. దీంతో వీరి ప్రేమను వారి తల్లిదండ్రులకు చెప్పారు.
వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాజంలో ఆమోద యోగ్యం కాదు, ఈ పిచ్చి ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. అయితే అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతులిద్దరికీ వారి మాటలు ఎక్కలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని (Two Girls Elope, Marry Each Other in Gurugram) నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం చేసుకున్నారు.
ఈ విషయం తెలియని జాజర్ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హజరుపర్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయి.
ఆ యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు తెలిపారు. అయితే, ఆ యువతుల తల్లిదండ్రులు మాత్రం వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట కానీ వారు అస్సలు వినిపించుకోవడం లేదట. ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గుచూపుతున్నారని హెలినామ్డి పోలీసు అధికారి మహేష్ కుమార్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jun 13, 2021 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

