New Delhi December 08: సీడీఎస్‌ బిపిన్ రావత్‌(CDS Bipin Rawat) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఇప్పుడంతా అదే చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం(Helicopter crash) లో పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు కూడా మరణించారు. ముఖ్యంగా హెలికాప్టర్ ప్రమాదం అనగానే తెలుగువారందరికీ గుర్తుకు వచ్చేది వైయస్ రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) మరణం. 2009లో జరిగిన ఈ దుర్ఘటన తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. వాటిని ఒకసారి చూద్దాం.

మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ( YSR )

హెలికాప్టర్ (helicopter) ప్రమాదం అంటే ముందుగా గుర్తొచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి(YS Rajashekar reddy) మర‌ణం. 2009 సెప్టెంబ‌ర్ 2న పావురాల గుట్ట వ‌ద్ద జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదం(helicopter crash) లో ఆయ‌న దుర్మర‌ణం చెందారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్(YSR) బయ‌ల్దేరిన కాసేప‌టికే ఆయ‌న ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గ‌ల్లంతైంది. క‌నిపించ‌కుండా పోయిన హెలికాప్టర్ కోసం దాదాపు 24 గంట‌ల పాటు వెతికితే.. చివ‌ర‌కు పావురాల గుట్ట వ‌ద్ద కుప్పకూలిన‌ట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో వైఎస్ఆర్‌తో పాటు మ‌రో ఐదుగురు సిబ్బంది మ‌ర‌ణించారు.

కేంద్ర మాజీ మంత్రి మాధ‌వ‌రావు సింథియా

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మాధ‌వ‌రావు సింథియా(Madhava Rao Scindia) విమాన ప్రమాదం(helicopter crash) లో మ‌ర‌ణించారు. 2001 సెప్టెంబ‌ర్‌లో యూపీలోని బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు కాన్పూర్‌కు వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జ‌రిగింది. కాన్పూర్‌కు 172కిలోమీట‌ర్ల దూరంలోని మెయిన్‌పురి శివార్లలో ఆయ‌న ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది(helicopter crash). ఈ దుర్ఘట‌న‌లో సింథియాతో పాటు మ‌రో ఆరుగురు మ‌ర‌ణించారు.

సంజ‌య్ గాంధీ

మాజీ ప్రధాన‌మంత్రి ఇందిరాగాంధీ(Indira Gandhi) చిన్న కుమారుడు సంజ‌య్ గాంధీ(Sanjay Gandhi) కూడా ఢిల్లీ స‌మీపంలో జ‌రిగిన ఎయిర్ క్రాష్‌(helicopter crash) లో మ‌ర‌ణించారు. 1980 జూన్ 23న ఆయ‌న ప్రయాణిస్తున్న తేలిక‌పాటి హెలికాప్టర్ గ్లైడ‌ర్‌.. ఢిల్లీ స‌ఫ్దర్జంగ్ విమాన‌శ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కుప్పకూలింది(helicopter crash). ఈ ప్రమాదంలో సంజ‌య్ గాంధీ(Sanjay Gandhi)  అక్కడిక‌క్కడే దుర్మర‌ణం చెందారు.

లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్‌ జీఎంసీ బాల‌యోగి

ఏపీలోని కృష్ణా జిల్లా కైక‌లూరులో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదం(helicopter crash) లో లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి(GMC Balayogi) క‌న్నుమూశారు. 2002 మార్చి 3న‌ భీమ‌వ‌రం నుంచి తిరిగివ‌స్తుండ‌గా ఆయ‌న ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్‌ ఒక కొబ్బరి చెట్టును ఢీకొని ప‌క్కనే ఉన్న చేప‌ల చెరువులో ప‌డింది.

న‌టి సౌంద‌ర్య ( Soundarya )

న‌టి సౌంద‌ర్య కూడా హెలికాప్టర్ ప్రమాదం(helicopter crash) లో దుర్మర‌ణం చెందారు. 2004 ఏప్రిల్ 17న బెంగ‌ళూరులోని జ‌క్కూరు విమానాశ్రయం స‌మీపంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది(helicopter crash). ఈ దుర్ఘట‌న‌లో సౌంద‌ర్య స‌జీవ ద‌హ‌నం అవ్వగా.. ఆమె సోద‌రుడు అమ‌ర‌నాథ్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

CDS General Bipin Rawat Dies: జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత, ఆయన భార్య మధులికా రావత్ తో సహా 11 మంది ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి, అధికారికంగా ప్రకటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

మోహ‌న్ కుమార మంగ‌ళం

1973 మే 31 జ‌రిగిన విమాన ప్రమాదం(helicopter crash) లో కాంగ్రెస్ మాజీ ఎంపీ మోహ‌న్ కుమార మంగ‌ళం(Mohan kumara Mangalam) దుర్మర‌ణం చెందారు. ఆ దుర్ఘట‌న‌లో మృత‌దేహాలు అన్ని చెదిరిపోయాయి. అయితే కుమార‌మంగ‌ళం ఉప‌యోగించే పార్కర్ పెన్‌, వినికిడి యంత్రం స‌హాయంతో ఆయ‌న మృత‌దేహాన్ని గుర్తించారు.

అరుణాచ‌ల్ ప్రదేశ్ మాజీ సీఎం ధోర్జీ ఖండూ

అరుణాచ‌ల్ ప్రదేశ్ మాజీ సీఎం ధోర్జీ ఖండూ(Dorgee Khandu) 2011లో జ‌రిగిన‌ హెలికాప్టర్ ప్రమాదం(helicopter crash) లో మ‌ర‌ణించారు. ప్రతికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా ధోర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లోబో తాండ్ వ‌ద్ద కూలింది. ఈ ప్రమాదంలో ధోర్జీ స‌హా ఐదుగురు మృతిచెందారు.

IAF Helicopter Crash: తునాతునకలైన ఆర్మీ హెలికాప్ట‌ర్, ప్రమాదానికి ముందు అసలేం జరిగింది, ఈ విషాద ఘటనపై ఎవరేమన్నారు, గ‌తంలోనూ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన బిపిన్ రావత్

జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్‌

జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్(Dorgee Khandu) కూడా హెలికాప్టర్ ప్రమాదం(helicopter crash) లోనే మ‌ర‌ణించారు. యూపీలోని స‌హార‌న్‌పూర్‌లో ఆయ‌న ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.