Chennai, Dec 8: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ కూనూరు వద్ద అటవీ ప్రాంతంలో కుప్ప కూలిన (IAF Helicopter Crash) సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదు మంది మృతి చెందారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అధికారులను వెల్లింగ్టన్ బేస్‌కు తరలించారు. వీరిలో బిపిన్ రావత్ (CDS General Bipin Rawat) కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో (military chopper crash) ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆర్మీ హెలికాప్టర్ తునాతునకలైంది. భారీ ప్రమాదానికి అక్కడున్న భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. వృక్షాలు కూడా పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. హెలికాప్టర్ భాగాలు ముద్దగా మారాయి. అసలు ఏ భాగం ఎక్కడుందో కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది.
వీరిలో బిపిన్ రావత్ భార్య మధులిక కూడా ఉన్నట్లు సమాచారం. భారత వాయుసేన ప్రమాదాన్ని అధికారంగా ధ్రువీకరించింది. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలీకాప్టర్‌లో సీడీఎస్ బిపిన్‌రావత్‌తో సహా ఆయన భార్య మధులిక, మరికొందరు కుటుంబసభ్యులు, సీడీఎస్ సిబ్బంది ఉన్నారని ట్వీట్ చేసింది.ఈ ఘటనపై. విచారణకు ఆదేశించింది.హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాద వివరాలను మోదీకి వివరించారు. స్పందించారు.
వాయుసేన ఈ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నారు. అయితే ఏదైనా మానవ తప్పిదం ఉందా లేక మెషీన్‌లో ఏదైనా లోపం తలెత్తిందా అన్న కోణంలోనూ విచారణ చేపడుతారు. ఇవే కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో పరిశీలిస్తారు. అయితే ఇవాళ జరిగిన ప్రమాదంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. అంత రేంజ్‌లో మంటలు రావడం కొంత అనుమానాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం నీలగిరిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యింది.
ఢిల్లీ నుంచి సూలూరు వెళ్లే వరకు..
బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌బేస్‌కు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 9 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. అక్కడి నుంచి కూనూరు కంటోన్మెంట్‌కు ఆర్మీ హెలికాప్టర్‌లో బిపిన్ రావత్ దంపతులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. ఇక కూనూరు ఎయిర్‌బేస్‌లో మరో 5 నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాపర్ కుప్పకూలిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా మధ్యాహ్నం 1:50కి ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలిపింది.
కూనూరు కంటోన్మెంట్ ఆర్మీ రీసెర్చ్ కేంద్రంలో ప్రసంగించాల్సి ఉండటంతో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అక్కడకు వెళ్లారు. ఈ కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. ఆ కంటోన్మెంట్ ఏరియాకు చేరుకునే క్రమంలోనే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బిపిన్ రావత్ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్. ఇది 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది.ఆర్మీలో ప్రస్తుతం 151 ఎంఐ 17 హెలికాప్టర్‌లు ఉన్నాయి.
కొద్ది సేపటి క్రితమే బిపిన్‌రావత్ ఇంటికి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు. ఘటన స్థలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సాయంత్రం చెన్నై నుంచి కోయంబత్తూరు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నీలగిరి వెళతారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం బిపిన్‌రావత్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నారని వినడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ప్రతిఒక్కరూ సురక్షితంగా బయటపడాలని వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నానని గడ్కరీ ట్వీట్ చేశారు. ప్రమాదం నుంచి సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు ఆయన సతీమణి మధులికా రావత్ క్షేమంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు.
హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ఘటనా ప్రాంతానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి బయలుదేరారు. ఎయిర్ చీఫ్ మార్షల్ సులూర్ ఎయిర్ బేస్‌ను సందర్శిస్తారని అధికారులు తెలిపారు.కాగా ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్‌కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఇక ఈ ఘటనపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రకటన చేసిన అనంతరం ఘటనా ప్రాంతాన్ని సందర్శిస్తారు.
గతంలోనూ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. 2015, ఫిబ్రవరి 3వ తేదీన బిపిన్ రావత్ నాగాలాండ్‌లోని దిమాపూర్ పర్యటనకు ఆర్మీ హెలికాప్టర్‌లో బయల్దేరారు. ఆ సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటన నుంచి రావత్‌తో పాటు ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నాగాలాండ్ ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ లెఫ్టినెంట్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆర్మీకి చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ కూలిన ప్రాంతం నీలగిరి కొండలు కర్నాటక బోర్డర్ వద్ద ఉన్నాయి. నీలగిరి కొండల్లోనే కూనూర్ ప్రాంతం ఉంది. టూరిస్టు నగరం ఊటీ ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాన్నే ఉదకమండలం అని అంటారు. ఊటీ , వెల్లింగ్టన్ ప్రాంతాల్లో..చాలా మంది రిటైర్ డిఫెన్స్ ఉద్యోగులు నివసిస్తుంటారు. సీనిక్ ప్రదేశాల్లో వారి ఇండ్లు ఉంటాయి. ఒకరకంగా ఇక్కడ మిలిటరీ సేఫ్ కల్చర్ ఉంటుంది. హై ఆల్టిట్యూడ్ ప్రాంతమే అయినా.. ప్రమాదంలో అనుమానాలు అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కొండల మధ్య పొగమంచు కామన్. బ్రీఫింగ్, బ్లాక్‌బాక్సులు సమాచారం ఆధారంగా.. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా బిపిన్ రావత్ 2019, జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. త్రివిధ దళాల(వాయుసే, ఆర్మీ, నౌకాదళం) తొలి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక ఆయన పదవీకాలం 2022, జనవరితో ముగియనుంది. అంతలోనే ఈ ప్రమాద ఘటన జరగడం చాలా దురదృష్టకరమని పలువురు భావిస్తున్నారు.
మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేసిన బిపిన్ రావత్.. 2019, జనవరిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు. మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించి.. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు.