తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) నలుగురు మరణించారని నీలగిరి జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. ఘటనా స్ధలంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని, హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ హెలికాఫ్టర్‌లో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ సహా కుటుంబ సభ్యులు, ఆయన సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్ కోయంబత్తూర్, కూనూర్ మధ్య కుప్పకూలింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని వాయుసేన అధికారులు తెలిపారు.
Four bodies recovered, three injured persons rescued from IAF helicopter crash site in TN: Official sources
— Press Trust of India (@PTI_News) December 8, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)