New Delhi, Jan 3: ప్రధాని నరేంద్ర మోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ మాలిక్ ఈ కామెంట్స్ చేశారు. రైతుల ఆందోళనలపై (Farmers Protests) జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ అహంకారంగా ప్రవర్తించారని అన్నారు. ఇదే విషయంపై ప్రధానితో తానూ గొడవకు దిగానన్నారు సత్యపాల్ మాలిక్. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని మోడీ దృష్టికి తెచ్చానన్నారు.
ఐతే మోడీ మాత్రం అహంకారంగా వాళ్లు నా కోసం చనిపోయారా అంటూ ప్రశ్నించారని చెప్పారు సత్యపాల్ మాలిక్. మీరు ప్రధానిగా ఉండగానే రైతులు చనిపోయారని తానూ సమాధానమిచ్చానన్నారు సత్యపాల్ మాలిక్. సత్యపాల్ మాలిక్ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్‌లో పోస్టు (Congress Shares Video) చేసింది. మంత్రి కేటీఆర్ సైతం ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సాగు చట్టాల విషయంలో రైతులపై నమోదైన కేసుల రద్దు విషయంలో కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలన్నారు సత్యపాల్ మాలిక్. MSPకి చట్టబద్ధత కల్పించే ప్రణాళిక సిద్దం చేయాలని డిమాండ్ చేశారు. రైతు పోరాటం ఆగిపోయిందని భావిస్తే పోరపాటేనని సత్యాపాల్ మాలిక్ అన్నారు.
Here's Congress Shares Video
घमंड...क्रूरता...संवेदनहीनता
भाजपा के राज्यपाल के इस बयान में पीएम मोदी के व्यक्तित्व में शामिल इन्हीं 'गुणों' का बखान है।
मगर, ये एक लोकतंत्र के लिए चिंता की बात है। pic.twitter.com/HGxzKfYsme
— Congress (@INCIndia) January 3, 2022
ఇంతకీ వీడియోలో ఏముంది.
రైతుల అంశంపై నేను ప్రధానిని కలడానికి వెళ్లినప్పుడు 5 నిమిషాల పాటు మీటింగ్ లో (Fought With Narendra Modi in 5 Minutes) ఆయనతో పోట్లాడాను..మోదీ చాలా అహంకారి (PM Was Arrogant). ఆందోళనల సమయంలో 500మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని నేను మోదీతో అన్నప్పుడు..నా కోసం ఏమైనా చనిపోయారా అని ప్రధాని అడిగారు. దానికి నేను అవును అని చెప్పారు.మీరు రాజు కాబట్టి అని ప్రధానితో అన్నారు. ఆ తర్వాత ఆయనతో పోట్లాట ఆపేశాను.
అమిత్ షా ను కలవాలని మోదీ చెప్పారు..నేను వెళ్లి ఆ తర్వాత షాతో కలిశాను” అని సత్యపాల్ మాలిక్ మాట్లాడినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఓ కుక్క చనిపోతే..సంతాపం తెలుపుతూ ప్రధాని లేఖలు పంపారని ఈ సందర్భంగా మాలిక్ గుర్తు చేశారు. కుక్కలకు ఇచ్చిన విలువ కూడా రైతులకు మోదీ ఇవ్వలేదని పరోక్షంగా మాలిక్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ లో షేర్ చేసిన మరో వీడియోలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ..”నేను అమిత్ షాను కలిసినప్పుడు సత్య మోదీకి మైండ్ పనిచేయట్లేదు. మీరు నిర్లక్ష్యంగా ఉండండి, మమ్మల్ని కలుస్తూ ఉండండి” అని కేంద్ర హోంమంత్రి చెప్పారని మాలిక్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. హర్యానాలోని చక్రి దాద్రిలో ఓ పబ్లిక్ మీటింగ్ లో సత్యపాల్ మాలిక్ ఈ కామెంట్స్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడంపై కేంద్రం నిజాయితీగా పనిచేయాలని,పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన విధానం తీసుకురాలని కూడా సత్యపాలిక్ ఈ కార్యక్రమం సందర్భంగా సృష్టం చేశారు.
రైతుల ఆందోళన కేవలం సస్పెండ్ చేయబడిందని,ఏదైనా వాళ్లకి అన్యాయం జరిగితే..ఆందోళన మళ్లీ మొదలుపెడుతారని మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానంగా మాలిక్ చెప్పారు. కాగా,మోదీ సర్కార్ పై సత్యపాల్ మాలిక్ విమర్శలు గుప్పించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేక సార్లు పలు సందర్భాల్లో కేంద్రం వైఖరిపై మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.