New Delhi, Mar14: కరోనావైరస్ వల్ల మరణించిన కుటుంబసభ్యులకు ఇచ్చే నష్టపరిహారం(COVID-19 Compensations) కోసం వేలసంఖ్యలో నకిలీ దరఖాస్తులు రావడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ మహమ్మారి వల్ల అనాథలుగా మారిన చిన్నారుల కోసం ఇవ్వాలనుకున్న ఎక్స్‌గ్రేషియాను నకిలీ మరణ ద్రువీకరణ పత్రాలతో(Fake Medical Certificates) అక్రమంగా తీసుకోవాలనుకోవడం దారుణమని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది.
జస్టిస్ ఎంఆర్ షా దీనిపై మాట్లాడుతూ.. ఇంతగా జనం దిగజారుతానని అనుకోలేదని, కోవిడ్ మృతుల నష్టపరిహారం కోసం నకిలీ పత్రాలు సమర్పించేంత దీనస్థాయికి మానవత్వం పడిపోయిందా అని, దీంట్లో ఎవరైనా ఆఫీసర్లు ఉంటే, అది సీరియస్ మ్యాటర్ అవుతుందని తెలిపారు. జస్టిస్ బీవీ నగరత్నతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అత్యున్నత దర్యాప్తు చేపట్టాలని కాగ్‌ను బెంచ్ ఆదేశించింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు స్పందించింది.
ఆర్‌టీపీసీఆర్ రిజల్ట్స్‌తో పాటు డెత్ సర్టిఫికేట్ సమర్పించే వారికి 50 వేల నష్టపరిహారాన్ని అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు తమ విపత్తు నిధుల నుంచి ఆ పరిహారాన్ని అందజేస్తున్నాయి. నకిలీ మరణపత్రాలను సమర్పిస్తే, వారికి రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని పిటీషినర్ అడ్వాకేట్ గౌరవ్ కుమార్ తె లిపారు. నష్టపరిహార దరఖాస్తులు స్వీకరించేందుకు ఏదైనా డెడ్‌లైన్ పెట్టాలని తుషార్ మెహతా కోరారు. ఒక్కొక్క మృతిడి కుటుంబానికి 50 వేల ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ పేరెంట్స్ ఇద్దరూ కోవిడ్‌తో చనిపోతే, అప్పుడు పిల్లలకు ఇద్దరి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోర్టు క్లియర్‌గా చెప్పింది.