Supreme Court says protesting doctors to resume work

ఇవ్వడమనే అంశంపై  సుప్రీంకోర్టు ఇవాళ కీల‌క తీర్పును వెలువ‌రిచింది. పీఎంఎల్ఏ కింద న‌మోదు అయిన మ‌నీల్యాండ‌రింగ్ కేసు విచార‌ణ స‌మ‌యంలో ధర్మాసనం.. బెయిల్ ఇవ్వ‌డం రూల్ అని, జైలుశిక్ష విధించ‌డం మిన‌హాయింపు అని, మనీ లాండరింగ్ కేసులకు ఇది వ‌ర్తిస్తుంద‌ని (SC on Bails in PMLA Cases) పేర్కొన్న‌ది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు చెందిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రేమ్ ప్ర‌కాశ్ అనే వ్య‌క్తి బెయిల్ పిటీష‌న్‌పై విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో అత్యున్నత ధర్మాసనం (Supreme Court) ఈ వ్యాఖ్య‌లు చేసింది.  సెక్షన్ 417 ప్రకారం వివాహం రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, దాన్ని మోసం చేసిన నేరంగా పరిగణించలేమంటూ వధువు తండ్రి వేసిన పిటిషన్‌ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం

జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, కేవీ విశ్వ‌నాథ‌న్‌ల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం  తీర్పును వెలువ‌రిస్తూ... వ్య‌క్తుల‌కు విముక్తి క‌ల్పించ‌డ‌మే రూల్ అని, చ‌ట్ట ప్ర‌కారం ఆ చ‌ర్య‌ను చేప‌ట్ట‌డ‌మే జైలుశిక్ష నుంచి మిన‌హాయింపు అని తెలిపింది. పీఎంఎల్ఏ కేసులో నిందితుడు ద‌ర్యాప్తు స‌మ‌యంలో వెల్ల‌డించే అంశాల‌ను ఆధారాలుగా తీసుకోలేమ‌ని కోర్టు చెప్పింది. ఎవిడెన్స్ యాక్టులోని సెక్ష‌న్ 25 వ‌ర్తిస్తుందా లేదా అన్న అంశాన్ని ఒక్కొక్క‌టిగా ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని కోర్టు తెలిపింది. ప్ర‌కాశ్‌కు బెయిల్ ఇచ్చిన కోర్టు.. 5 ల‌క్ష‌ల పూచీక‌త్తుపై విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.