New Delhi, July 1: ఓ టీవీ చర్చలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అనంతరం దేశంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా తనపై నమోదు అయిన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టులో నుపుర్ శర్మ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలకు (Hate Remarks on Prophet) ఆమె ఒక్కరే వ్యక్తిగతంగా బాధ్యురాలని, యావత్ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని కోర్టు (SC Slams Nupur Sharma) తెలిపింది.
టీవీ చర్చ సమయంలో ఆమెను ఎలా రెచ్చగొట్టారో చూశామని, కానీ ఆ తర్వాత ఆమె మాట్లాడిన తీరు ఆందోళనలకు ( Disturbing Outcomes Including Udaipur Murder Case) దారి తీసిందని, నుపుర్ దేశానికి క్షమాపణ చెప్పాలని జస్టిస్ సూర్య కాంత్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని నుపుర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్య కాంత్ స్పందిస్తూ ఆమెకు బెదిరింపులు వస్తున్నాయా లేక ఆమె సెక్యూర్టీ సమస్యగా మారిందా అని ఆయన అడిగారు.
నుపుర్ చేసిన వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజల్లో భావోద్వేగాలను రగిలించిందని, దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఈ మహిలే బాధ్యురాలు అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. నుపుర్ శర్మ నోరు జారడం వల్ల దేశం అగ్నికాష్టంగా మారినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఉదయ్‌పూర్ ఘటనకు ఆమె మాటలే కారణమని కోర్టు చెప్పింది.
ఇక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్య కేసు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేశారు. సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహమ్మద్‌లను అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించారు.
పాక్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో హంతకులకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉదయ్‌పూర్ ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్న రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథర్ తెలిపారు. ఇద్దరు నిందితులను గురువారం కోర్టుముందు హాజరుపరిచారు. ఆ ఇద్దర్నీ 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కన్హయ్యలాల్‌ను తలను నరికిన నిందితులు ఆ ఘటనను షూట్ చేశారు. ఓ వీడియోలో ప్రధాని మోదీని కూడా వాళ్లు బెదిరించారు.