Cyclone (Photo Credits: Wikimedia Commons)

Chennai, Nov 12: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఈ వాయుగుండం తీరం దాటిందని సంబరపడేలోపు మరో ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్‌ సముద్రంలో రేపు మరో అల్పపీడనం తలెత్తనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

నిన్న తీరాన్ని దాటి నేలపైకి వచ్చిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. మరో 24 గంటలపాటు ఏపీపై వాయుగుండం ప్రభావం చూపనుంది. రాబోయే 48 గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులో అతి భారీ వర్షాలు (Tamil Nadu Rains) కురిసే అవకాశం ఉంది.

విద్యుత్ సమస్య ఉంటే వెంటనే 1912కు ఫోన్ చేయండి, విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన APSPDCL MD హెచ్. హరనాథ రావు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా (Season of floods) రాజధాని చెన్నైలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో (Heavy rains disrupt daily life) ఉండడంతో రాష్ట్రంలో వరదలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు.

తగ్గుతున్న యాక్టివ్ కేసులు, దేశంలో 1,37,416 మందికి కొనసాగుతున్న చికిత్స, తాజాగా 12,516 క‌రోనా కేసులు న‌మోదు, నిన్న ఒక్కరోజే 501 మంది మృతి

తూర్పుగోదావరి జిల్లాలో వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, గాలులతో 27 మండలాల్లో 61,893 ఎకరాల్లో వరి నేలకొరిగింది. కాకినాడ పోర్టులో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విదేశీ నౌకల్లోకి నిన్నటి నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. బార్జీలన్నింటినీ నిలుపుదల చేశారు. అటు వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ, అంతర్వేదిలోనూ సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Here's Chennai Rains Visuals

తీవ్ర వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. డెల్టాలో పొలాల్లోకి వర్షం నీరు చేరింది. కడప జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కడప నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుగ్గవంక ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 2 గేట్లను ఎత్తి 1600 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తివేయడంతో బుగ్గవంక పరీవాహ ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేశారు.

భారీ వర్షాలకు తమిళనాడులో 14 మంది మృతి, రాగల 24 గంటల్లో తమిళనాడు, ఏపీ‌లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం మరోమారు జలదిగ్బంధంలో చిక్కుకుంది. నాలుగు రోజులకు ముందు రాత్రంతా కురిసిన కుండపోత వర్షం సృష్టించిన బీభత్సం నుంచి నగరం కోలుకోకముందే వాయుగుండం ప్రభావం అతలాకుతలం చేసింది. నగరంలో ప్రధాన రహదారుల్లోని 11 సబ్‌వేలు నీట మునగటంతో ఆయా మార్గాలలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

తుఫాను ముప్పు, నీట మునిగిన నెల్లూరు, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అదేశాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

ప్రధాన రహదారుల్లో మూడడుగుల లోతున వర్షపునీరు వరదలా ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరంతా వాగులా పొంగి ప్రవహిస్తుండటంతో వాహనాలన్నీ కదలక మొరాయించాయి. స్థానిక వేళచ్చేరి రాంనగర్‌లోని పలు వీధుల్లో నాలుగడుగుల లోతున వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీనితో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇళ్లలో చిక్కుకున్నవారిని రబ్బరు పడవల ద్వారా అగ్నిమాపక దళం సభ్యులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కీల్‌కట్టలై చెరువు నీటితో నిండి పొంగి ప్రవహించడంతో ప్రధాన రహదారిలో వరద పరిస్థితులు నెలకొన్నాయి.