Arshad Warsi (Photo-Twitter)

షేర్ మార్కెట్ , స్టాక్ సంబంధిత అంశాలపై తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్న నటుడు అర్షద్ వార్సీ , అతని భార్య మరియా గోరెట్టికి మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ భారీ షాక్ ఇచ్చింది.సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్న సాధన బ్రాడ్‌కాస్ట్ ప్రమోటర్లతో సహా, 31 యూట్యూబర్లను గురువారం బ్యాన్‌ చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ మొత్తం 46 మందిని కనీసం ఒక సంవత్సరం పాటు మార్కెట్‌లను యాక్సెస్ చేయకుండా నిషేధించింది.

ఈ కేసుకు సంబంధించి వార్సీ, అతని భార్య కూడా రెగ్యులేటర్ ద్వారా జరిమానా విధించబడింది.యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలను అప్‌లోడ్ చేయడం ద్వారా సాధనా బ్రాడ్‌కాస్ట్ షేర్లను మానిప్యులేట్‌ చేశారంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది.

అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం, అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని సెబీకి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఈ తప్పుడు పద్దతుల ద్వారా అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల లాభం ఆర్జించారని సెబీ పేర్కొంది. అంతేకాదు ఆయా సంస్థలనుంచి రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను రెగ్యులేటర్ స్వాధీనం చేసుకుంది. నిందితుడు అర్షద్ వార్సీతో సహా చాలా మంది యూట్యూబర్లు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం ద్వారా వారి వాల్యూమ్‌ను పెంచుతున్నారని తద్వారా ప్రతి నెలా రూ.75 లక్షల వరకు సంపాదిస్తున్నారని సెబీ తెలిపింది.