'Petrol at Rs 1 Per Litre': రూపాయికే లీటరు పెట్రోల్, ఆదిత్య థాకరే పుట్టిన రోజు సంధర్భంగా ముంబైలో విక్రయించిన శివసేన కార్యకర్తలు, సుమారు 1200 మంది వాహనదారులకు విక్రయం
Aaditya Thackeray | (Photo Credits-Twitter)

Mumbai, June 14: మహారాష్ట్ర యువనేత, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే పుట్టినరోజు (Aditya Thackeray's birthday) సందర్బంగా ఆదివారం ముంబై నగరంలోఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆయన అభిమానులు (Shiv Sena party supporters) లీటరు పెట్రోలు రూపాయికే విక్రయించారు. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు Dombivli ప్రాంతంలో వాహనదారులకు బారులుతీరారు.

డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఐడిసిలోని ఉస్మా పెట్రోల్ పంప్ వద్ద ఆదివారం భారీ క్యూ కనిపించింది.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గంటలకు రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ను (petrol at Rs 1 per litre) పంపిణీ చేశారు. కాగా ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు, లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రయాణికులు తమ సొంత వాహనాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా వీరిపై రోజుకు సుమారు 400 రూపాయల భారం పడుతోదని శివసేన స్థానిక దీపేశ్ మత్రే చెప్పారు.

Here's Update 

మొదటి 500 మందికి ఇవ్వాలనుకున్నాం. కానీ జనం భారీగా రావడంతో దీన్ని కొనసాగించామని తెలిపారు. సుమారు 1200 మంది వాహనదారులు ప్రతి వ్యక్తికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందుకున్నారు, ఇది పెట్రోలు రేట్ల పెరుగుదలకు శివసేన యొక్క నిరసన అని కొందరు అంటున్నారు. కాగా ముంబైలో లీటరుకు రూ. 102.58, డీజిల్‌ రూ. 94.70 పలుకుతున్న సంగతి తెలిసిందే.