Dynamite Blast in Karnataka (Photo Credits: ANI)

Bengaluru, Jan 23: కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. శివమొగ్గ జిల్లా కేంద్రానికి సమీపంలో భారీ పేలుడు (Shivamogga blast) సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ పేలుడుతొ పొరుగునున్న దావణగెరె, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఓ మోస్తరు భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భూకంప భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషాదంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా సానుభూతి తెలిపారు.

గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కొందరు కార్మికులు లారీలో సుమారు 50 బాక్స్‌ల డైనమైట్లు, జిలెటిన్‌ కడ్డీలను వేసుకుని వస్తుండగా పేలుడు (5 people dead in mega explosion) చోటుచేసుకుంది. ఆ తీవ్రతకు లారీ ఆనవాళ్లు లేకుండా పోయింది. మృతదేహాలు మాంసం ముద్దలుగా అర కిలోమీటర్‌ దూరం వరకు పడిపోయా యి. సమీపంలో ఉన్న బోలెరో వాహనం కాలి బూడిదైంది. చుట్టుపక్కల ఉన్న విద్యుత్‌ లైన్ల వైర్లు తెగిపడ్డాయి. ఆ ప్రాంతంలో మంటలతో పాటు కొండలా దట్టమైన దుమ్ము ధూళి కమ్ముకుంది. ఇక్కడ పని చేస్తున్న వారిలో అనేక మంది కార్మికులు బిహార్, అసోంకు చెందిన వారని స్థానికులు తెలిపారు.

ఉన్నట్టుండి నేలపై కుప్పకూలిన మనిషి, సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాల్ని నిలబెట్టిన సీఐఎస్ఎఫ్ జవాను, ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

కనీసం ఆరుగురు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా కనీసం 10–15 మంది చనిపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు. కాగా, మృతుల్లో ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంనకు చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. కాగా క్రషర్‌ యజమాని సుధాకర్, క్వారీ నిర్వాహకుడు నరసింహ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప పరిహారం (Rs 5 lakh compensation to kin of deceased) ప్రకటించారు.