శ్రీకృష్ణ జన్మభూమి కేసులో (Shri Krishna Janmabhoomi case) మథురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో (Shahi Idgah Complexe) సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందూ పక్షం ‘శ్రీ కృష్ణ విరాజ్‌మాన్’ తరపున దాఖలైన పిటిషన్ పరిశీలించి కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఈ మేరకు గురువారం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది.ముగ్గురు న్యాయవాదులను కమిషనర్లుగా నియమిస్తూ కోర్టు నిర్ణయించింది. వివాదాస్పద మసీద్ కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసుకు సంబంధించి మథుర డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి బదిలీ అయిన మొత్తం 18 పిటిషన్లను హైకోర్టు పరిశీలిచింది. మథుర డిస్ట్రిక్ట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు అన్నింటినీ అందించాలని హైకోర్టు కోరింది.మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి.