Lucknow, May 2; ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచనంగా మారిన బీజేపీ నేత శ్వేతా సింగ్ మృతి కేసులో కీలక విషయాలు (Shweta Singh Gaur Death Case) వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, కట్టుకున్న భర్తే (Deepak singh gaur) హత్య చేసి ఉరికి వేలాడిదీసినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఈ మేరకు శ్వేతా సింగ్ గౌర్ మృతి (Shweta Singh Gaur Death) తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త దీపక్ సింగ్ గౌర్‌కి సంబంధించిన ఆడియో వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోల ద్వారా తనకు, అంతర్జాతీయ సెక్స్ ముఠాకు (international sex racket connect) ఉన్న సంబంధాలు భార్యకు తెలిశాయి. ఈ విషయాలను ఆమె బహిర్గతం చేస్తుందని భావించిన భర్త దీపక్ సింగ్ ఆమెను హత్య చేసి చంపేశాడు.మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు శ్వేతాసింగ్ భర్త దీపక్ సింగ్ రష్యన్, మొరాకో, ఆఫ్రికన్ అమ్మాయిల కోసం బ్రోకర్లతో సంప్రదింపులు జరిపారు. శ్వేత తన మరణానికి ముందు తన భర్త ఫోన్ కాల్స్ రికార్డింగుల గురించి తన కుటుంబ సభ్యులకు ( BJP leader Shweta Singh Gaur's family) తెలిపారు. రష్యాలోని సెక్స్ వర్కర్లతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని దాచిపెట్టేందుకు దీపక్ ఆమెను హత్య చేసి ఉంటాడని ఆమె సోదరుడు రితురాజ్ ఆరోపించారు.
ఓ ఆడియోలో దీపక్ ఓ రష్యన్ అమ్మాయిని అడగ్గా బ్రోకర్ మాత్రం తన వద్ద మొరాకో అమ్మాయి మాత్రమే ఉందని చెప్పాడు. అప్పుడు దీపక్.. తాము నలుగురం ఉన్నామని, కాబట్టి ఒక ఇండియన్ అమ్మాయి కూడా కావాలని కోరారు. ఈ సంభాషణ చాలాసేపు నడిచింది. అనంతరం దీపక్.. తాను లక్నోలోని నాకా హిందోళ ప్రాంతంలో ఉన్న ఎంజే ఇంటర్నేషనల్ హోటల్‌లో ఉన్నట్టు చెప్పారు. అక్కడికే ఇద్దరు అమ్మాయిలను పంపాలని కోరారు. కాగా, దీపక్ సింగ్‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంధించి పలు వీడియోలు కూడా అందుకున్నట్టు ఎస్పీ అభినందన్ చెప్పారు. అన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
కాగా భార్యతో మనస్పర్థలు రావడంతో దీపక్ తన కూతుళ్లను కూడా పట్టించుకోకుండా మద్యం మత్తులో మునిగి తేలేవాడని పోలీసులు విచారణలో తేలింది. దీంతో భార్యభర్తల వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. ఉదయం 5 గంటల నుండి అతను మద్యంలోనే మునిగితేలేవాడని రాత్రి వరకు అదే మత్తులు ఉంటూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడని భాదిత కుటుంబసభ్యులు తెలిపారు. కాగా లీకైన ఆడియోలో 25 వేల రూపాయలకు ఇద్దరు అమ్మాయిలను బుక్ చేసుకునేందుకు రాయబారాలు జరిగాయని తెలుస్తోంది.