Sidhu Moosewala (Pic Credit- Instagram)

New Delhi, May 31: పంజాబీ సింగ‌ర్ సిద్ధూ మూసేవాలా శ‌రీరంపై 24 చోట్ల బుల్లెట్ గాయాలు (24 Bullet Wounds on His Body) ఉన్న‌ట్లు అటాప్సీ రిపోర్ట్‌లో తేలింది. కేవ‌లం రెండు నిమిషాల లోపే సుమారు 30 రౌండ్ల కాల్పులు జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్ట‌మ్ త‌ర్వాత సిద్దూ భౌతిక‌దేహాన్ని (Sidhu Moosewala’s Murder) కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. స్వ‌గ్రామంలో సిద్దూకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. భారీ సంఖ్య‌లో అభిమానులు, జ‌నం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

సెక్యూర్టీ తొల‌గించిన 24 గంట‌ల్లోనే సిద్ధూ మూసేవాలాను మ‌ర్డ‌ర్ చేశారు. మాన్సాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. మ‌హేంద్ర థార్ వాహ‌నంలో వెళ్తున్న అత‌న్ని సుమారు ప‌ది మంది చుట్టుముట్టి కాల్చారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో దాదాపు 20 రౌండ్ల క‌న్నా ఎక్కువే కాల్చారు. హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశం నుంచి సేక‌రించిన బుల్లెట్ షెల్స్‌తో.. ఏకే-47 రైఫిల్‌ను వాడిన‌ట్లు అనుమానిస్తున్నారు. కెన‌డా గ్యాంగ్‌స్ట‌ర్‌ గోల్డీ బ్రార్‌, లారెన్స్ బిష్ణోయ్ ఈ కేసులో నిందితుల‌న్న అనుమానాలున్నాయి.

పీఎం కిసాన్ రూ. 2 వేలు అకౌంట్లో పడ్డాయా, ఎలా చెక్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి, రూ.21 వేల కోట్ల రూపాయలను విడుదల చేసిన మోదీ సర్కారు

మరోవైపు.. సిద్ధూ మూసేవాలాను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్నాడని భావిస్తున్న ఓ అనుమానితుడ్ని(లారెన్స్‌) పంజాబ్‌ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్‌లోని పర్వత సానువుల్లో హేమకుండ్ సాహిబ్ పవిత్ర యాత్ర నిర్వహిస్తుండగా, ఆ యాత్రలో పాల్గొన్న భక్తుల చాటున ఆ అనుమానితుడు దాక్కున్నప్పటికీ అతడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, మరో ఐదుగురు అనుమానితులను కూడా ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.