New Delhi December 30: దేశ రాజధానిలో(New Delhi) కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు పదుల సంఖ్యలో వచ్చిన కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ కేసులు(Omicron Cases) ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయి.

ఢిల్లీలో పలువురిలో ఎలాంటి  ట్రావెల్‌ హిస్టరీ(Travel History) లేనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు(Omicron) వెలుగు చూస్తున్నాయని, కొత్త వేరియంట్‌ సామాజికంగా వ్యాప్తి జరుగుతున్నదని(spreading In Community) అర్థమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌(Satyendra Jain) అన్నారు. ఢిల్లీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్‌ వేరింట్‌వేనని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో బయటపడిందని చెప్పారు.

ఢిల్లీలో బుధవారం భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 923 కేసులు వెలుగుచూశాయి. గత మే 30 తర్వాత ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎల్లో అలర్ట్‌(Yellow alret) జారీచేసింది. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. నగరంలో ఇప్పటివరకు 263 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

U.S. Coronavirus: అమెరికాను వణికిస్తున్న కరోనా, ఒక్కరోజే నాలుగున్నర లక్షల కేసులు నమోదు, అగ్రరాజ్యంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు