Mumbai, Oct 18: సరిహద్దులో మళ్లీ ఉద్రికత్తలు చెలరేగుతున్న నేపథ్యంలో.. చైనా పైనా సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Shiv Sena Leader Sanjay Raut) కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. కేంద్రంపై విరుచుకుపడ్డారు.

ఉగ్రవాదులు కశ్మీర్‌లో వలసదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. లడక్‌, కశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితులపై హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశానికి చెప్పాలని డిమాండ్‌ చేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా (Situation in J-K worrisome) ఉందన్నారు. బీహార్‌ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. పాక్‌ విషయంలో తరచూ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ గురించి మాట్లాడుతారని, ఇప్పుడు చైనాపై కూడా చేయాలన్నారు. ఆదివారం రాత్రి బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మళ్లీ మరో ముప్పు, కరోనాకు తోడైన డెంగ్యూ, ఢిల్లీలో తొలి మరణం, దేశ రాజధానిలో ఈ ఏడాది 720కి పైగా డెంగీ కేసులు నమోదు

కుల్గాం జిల్లాలోని వాన్‌పో ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో కార్మికుడికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో గత 15 రోజుల్లో 13 మంది పౌరులు మృత్యువాతపడ్డారు.