SBI (Photo Credits: PTI)

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్‌, యూపీఐ సేవలు (SBI Servers Down) నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా నగదు ఉపసంహరణ జరగడం లేదని వాపోతున్నారు.ఎస్బీఐ ఏటిఎంలు , యోనో యాప్, యుపిఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు ఇలా అన్ని కూడా పని చెయ్యక పోవడంతో బ్యాంక్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఎస్‌బీఐ (State Bank of India) బ్యాంక్‌ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్‌బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్‌ సేవలు స్తంభించడంపై ఎస్‌బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన లావాదేవీలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్‌బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు.

జియో డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న ముఖేస్ అంబానీ, కుమారుడు ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్‌గా ప్రకటించిన సంస్థ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు

అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్‌ సేవలు స్తంభించడంపై ఎస్‌బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయింటెనెన్స్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇకపోతే ఎస్‌బీఐ 21వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి రెడీ అవుతోంది. దేశ్యాప్తంగా ఉన్న 29 ఆథరైజ్డ్ బ్రాంచుల ద్వారా వీటి జారీ ఉంటుందని ఎస్‌బీఐ వెల్లడించింది. జులై 1 నుంచి జూలై 10 వరకు బాండ్ల జారీ ఉంటుందని తెలిపింది.

ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలకు డొనేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి విలువతో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ఈ బాండ్లను జారీ చేసిన రోజు నుంచి 15 రోజులలోగా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ డబ్బులను రాజకీయ పార్టీలు పొందలేవు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. వ్యక్తి లేదా కంపెనీ ఇలా ఎవరైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.