New Delhi, Dec 2: భారత జాతీయ గీతంలో అనవసరపు పదాలు ఉన్నాయని దానిని మార్చాలని ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. మన దేశ జాతీయ గీతం (National Anthem) ఎవరిని ప్రశంసిస్తూ రాశారనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని లేఖలో (Subramanian Swamy Urges PM Narendra Modi) పేర్కొన్నారు. దాని స్థానంలో సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ 1943 అక్టోబరు 21న ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకోగానే ఆలపించిన గీతాన్ని (National Anthem of India) అమలు చేయాలంటూ మంగళవారం ప్రధానికి లేఖ రాశారు.
జనగనమణ’లో పేర్కొన్న ‘సింధు’ ప్రాంతం ఇప్పుడు పాక్ భూభాగంలో ఉందని, దానిని తొలగించి ‘ఈశాన్యం’ అనే పదాన్ని జోడించాలంటూ 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టిన విషయాన్ని లేఖలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు.
భవిష్యత్తులో ‘జనగనమణ’లోని అనవసరపు పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. కొత్త జాతీయ గీతాన్ని వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ లోపు రూపొందించాలని ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. ‘జనగణమణ’ను 1911 డిసెంబరు 27న కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆలపించారని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.
Here's BJP MP Tweet
My letter to PM Modi on Jana Gana Mana pic.twitter.com/qc1KnLDb2g
— Subramanian Swamy (@Swamy39) December 1, 2020
అందులోని ‘భారత భాగ్య విధాత’ అనే పదానికి బదులు ఇండియన్ నేషనల్ ఆర్మీ 1943లో ‘షుభ్ సుఖ్ చైన్’ అనే పదాన్ని జోడించి ఆలపించింది. ఈ కొత్త జాతీయ గీతాన్ని బోస్ రచించగా కెప్టెన్ రామ్‌సింగ్ స్వరపరిచారని బీజేపీ ఎంపీ తెలిపారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌చే రచించబడిన జాతీయ గీతం " జన గణ మన " ను లోక్‌సభ జనవరి 24, 1950 నాడు జాతీయ గీతంగా ఆమోదించింది. ఈ జాతీయ గీతాన్ని తొలిసారిగా 27 డిసెంబరు, 1911న కోలకతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాడటం జరిగింది.
మన జాతీయ గీతం
జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగ
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశీష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళదాయక జయ హే
భారత భాగ్య విధాతా
జయహే, జయహే, జయహే
జయ జయ జయ జయహే
కాగా జాతీయ గీతాన్ని కేవలం 52 సెకండ్లలోనే పాడాలి. ప్రత్యేక సమయాలలో గేయం ప్రారంభపు, చివరనున్న చిన్న పంక్తులను లఘు జాతీయ గీతంలా కేవలం ఇరవై సెకండ్లలోనే పాడాల్సివుంటుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంటే అప్పుడు ప్రతి పౌరుడు కూడా సావధానంగా నిలబడి ఆ గీతాన్ని గౌరవించడం ప్రతి భారతీయ పౌరుని కర్తవ్యం.