Sudha Murty (Photo Credit: X/ @ShivAroor)

ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. స్వతహాగా రచయిత అయన సుధామూర్తి మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయ్యారు.సుధామూర్తికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఎక్స్ లో ట్వీట్ చేసస్తూ ప్రధాని.. సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తిని పెద్దల సభకు పంపించడం సంతోషంగా ఉంది. సుధామూర్తి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. విద్య రంగం కోసం కృషి అపారమైన సేవలు అందించారు.  దేశంలో తొలిసారిగా ఘనంగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం, 20 విభాగాలలో అవార్డులు ప్రదానం, వీడియోలు ఇవిగో..

దాతృత్వ కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాజ్యసభలో సుధామూర్తి తన పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని’ ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కాగా కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగం, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన 12 మంది ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ 12 మందిలో సుధామూర్తి ఒకరు.

Here's PM Modi Tweet

తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం కొత్త బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.