Supreme Court of India |(Photo Credits: IANS)

New Delhi, April 1: కరోనా వ్యాప్తి (coronavirus Spread)నివారణలో భాగంగా అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన వలసకార్మికులకు ఆహారం, ఆశ్రయం, వైద్యం కల్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దలతో చర్చించి వారికి ఆశ్రయం కల్పించేలా చూడాలని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే (Chief Justice S A Bobde) నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వలసకార్మికుల్లో భయం పోగొట్టేందుకు శిక్షణ పొందిన కౌన్సిలర్లను వారితో మాట్లాడేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది.

దీంతో పాటుగా కరోనా వ్యాప్తిపై ఫేక్‌ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా నివారించాలని, కచ్చితమైన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ సోకిన, క్వారంటైన్‌లో ఉంచిన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యేలా చూడాలని మరో న్యాయమూర్తి ఎల్‌.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ఆదేశిం చారు. లాక్‌డౌన్‌ అనంతరం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి ఇళ్లకు మరలడంపై దాఖలైన రెండు పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ నాగేశ్వరరావుల బెంచ్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది.

భారతదేశంలో 1,637కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కోర్టు ఆదేశాల మేరకు స్టేటస్‌ రిపోర్ట్‌ను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా సమర్పించారు. కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ఆ నివేదికలో తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశంలోని నగరాల నుంచి గ్రామాలకు వలస వెళుతున్న ప్రతి 10 మందిలో ముగ్గుర్నుంచి కరోనా వైరస్‌ విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ఎయిర్‌ పోర్టులు, ఓడ రేవుల్లో 28 లక్షల మందికి స్క్రీనింగ్‌ నిర్వహించామని... వీరిలో 3.5 లక్షల మందిని పరిశీలనలో ఉంచామని చెప్పారు.

ఏపీలో 87కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఆగిపోయిన 22.88 లక్షల మంది కార్మికులు, కూలీలు, పేదల కోసం అన్ని ప్రభుత్వాలు ఆహారం, ఆశ్రయాన్ని అందిస్తున్నాయని తుషార్‌ మెహతా తెలిపారు.

ఐపిఎస్‌ సెక్షన్‌ 188 ప్రకారం.. ప్రజా య్రోజనాలు, ఆరోగ్య విషయాల్లో ప్రభుత్వ అధికారులు జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం శిక్షార్హమైన నేరమని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే అన్నారు. ఈ నిబంధన ప్రకారం దోషులకు ఆరునెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించాలని, లేదా రెండూ విధించవచ్చని అన్నారు.

ఏపీలో ‘ఢిల్లీ’ కరోనా కల్లోలం

శిక్షణపొందిన కౌన్సెలర్లను రప్పించి షెల్టర్‌ హోమ్‌లలో ఉన్న వలస కార్మికుల్లో ఆందోళనను పోగొట్టాలి. పోలీసులకు బదులుగా వలంటీర్లకే షెల్టర్ల నిర్వహణ బాధ్యతలు చూడాలి. కార్మికులకు పరీక్షలు చేపట్టి, అవసరమైతే క్వారంటైన్‌లో ఉంచాలని ఉత్తర్వులు అత్యున్న ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా

ఇదిలా ఉంటే దేశంలోని పౌరులందరికీ కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్ష ఉచితంగా చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఉచితంగా పరీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ లాయర్‌ శశాంక్‌ డియో సుధి పిటిషన్‌ దాఖలు చేశారు. తమకున్న రోగాన్ని నిర్ధారణ చేసుకొనేందుకు సాధారణ పౌరులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే అక్కడ భారీగా ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని అందులో స్పష్టంచేశారు.