Coronavirus in AP: డేంజర్ జోన్‌లో కడప, 24 గంటల్లో 15 కరోనా కేసులు, ఏపీలో 87కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు నమోదు
Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, April 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) ఒక్కసారిగా కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరిగాయి. 24 గంటల్లోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి.

 ఏపీలో ‘ఢిల్లీ’ కరోనా కల్లోలం

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in AP) నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) అలర్ట్ అయింది.

కాగా ఒక్క కడపలోనే (kadapa) 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 4 ఉన్న కేసులు నేడు 15కి చేరాయి. పశ్చిమ గోదావరిలో నిన్న ఒక్కరోజే 13 కేసులు నమోదయ్యాయి. అనంతపూర్ 2, చిత్తూరు 6, తూర్పు గోదావరి 6, గుంటూరు 9, క్రిష్ణా 6, కర్నూలు 1, నెల్లూరు 3, విశాఖపట్నం 11 గా ఉన్నాయి. కాగా వీరిలో నెల్లూరు నుంచి ఒకరు రికవరీ కాగా విశాఖపట్నం నుంచి మరోకరు రికవరీ కావడం ఊరటనిచ్చే అంశం.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల చెల్లింపు వాయిదా

ఊహించని విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి ప్రమాదం ముంచుకు రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్రం నుంచి 369 మంది హాజరయ్యారని అనధికార సమాచారం.

కరోనాపేషెంట్లపై నిఘా కోసం ట్రాకింగ్ సిస్టం

వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 13 నుంచి 16 వరకు ప్రార్థనలు నిర్వహించారు. తిరిగి 17, 18, 19 తేదీల్లో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం ఢిల్లీ వెళ్లొచ్చిన వారేనని నిర్ధారణ కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయి వారిపై నిఘా పెట్టింది.

ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం

కాగా ఢిల్లీ నుంచి ఏపీకి మొత్తం 1470 మంది ప్రయాణికులు వచ్చారని ప్రభుత్వం గుర్తించింది. వారిలో 1321 మందిని ఏపీ ఇప్పటికే గుర్తించగా 149 మంది వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో క్వారంటైన్ కి 598మంది వెళ్లారు. ఆస్పత్రిలో 405 మంది ఉన్నారు. ఇంకా 318 మంది వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో 535 మంది నమూనాలు సేకరించగా 115 మందికి నెగిటివ్ వచ్చింది. 16 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇంకా 404 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది.

ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలతోపాటు అనుమానితులు, ఢిల్లీ వెళ్లి వచ్చినవారు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, వైద్య ఆరోగ్య సిబ్బందితో పోలీసులు జల్లెడ పడుతున్నారు. కోవిడ్‌ సోకిందని అనుమానించే వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని అధికారులు కోరుతున్నారు. అలా రానివారిని నిర్బంధంగా క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ రహస్యంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసు కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.