Menstrual Leave for Woman: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు(Menstrual Leave) కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సమస్యపై పాలసీని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని కేంద్రానికి సూచించింది. రుతుక్రమ సెలవులు మంజూరు చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో పాటు వారి శ్రామిక శక్తి కూడా తగ్గిపోతుందని పేర్కొంది.
"కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన విధాన నిర్ణయం ఇది. మహిళల కోసం తెచ్చిన విధానాలు అనుకోకుండా వారికి ప్రతికూలంగా మారడం మాకు ఇష్టం లేదు. పిటిషనర్ తమ అభ్యర్థనతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించాలి. విధానపర నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. పుట్టింటి నుంచి భార్య తెచ్చుకునే బంగారంపై భర్తకు హక్కు ఉండదు.. అదేం ఉమ్మడి ఆస్తి కాదు.. ఇబ్బందుల్లో ఆ బంగారాన్ని భర్త వాడుకున్నా.. దాన్ని మళ్లీ భార్యకు తిరిగి ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
బీహార్ 1992 నుంచి ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తోంది. కేరళ కూడా అదే బాటలో పయనిస్తూ పాఠశాల, కళాశాల విద్యార్థినులకు మూడు రోజుల సెలవులు ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని దేశమంతా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.