Delhi, Aug 4: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించిన విషయం తెలిసిందే. సెల్లార్‌లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా గత నెల 27న రాత్రి భారీ వర్షాలకు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. విద్యార్థులు సంబంధింత కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని అప్పటి నుండి ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. అవి కోచింగ్ సెంటర్లు కాదు డెత్ ఛాంబర్లు అని అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం. కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని...ఈ ఘటన ఓ కనువిప్పు లాంటిదని అభిప్రాయపడింది.
ఇకపై అన్ని భద్రతా ప్రమాణాలను పాటించే కోచింగ్ సంస్థలకే అనుమతులు ఇవ్వాలని ..రావూస్ ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు, త్వరలో ఉప ఎన్నిక ఖాయమన్న కేటీఆర్
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించిన సంగతి తెలిసిందే.